SSMB 29: జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డు అందుకొని హాలీవుడ్ దృష్టిని కూడా తనవైపు తిప్పుకున్నారు రాజమౌళి. ఈ నేపధ్యంలో ఆయన నెక్స్ట్ చేయబోయే సినిమాలపై ఇంటర్నేషనల్ మీడియా ఫోకస్ కూడా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దానికి తగ్గట్లుగానే రాజమౌళి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వంచర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో మూవీ రెడీ చేస్తున్నారు. దీనిపై జక్కన్న తండ్రి స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ ఇప్పటికే వర్క్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో సూపర్ స్టార్ వరల్డ్ అడ్వంచర్ ట్రావెలర్ గా కనిపించబోతున్నారు.
ఇక రాజమౌళి మొదటి నుంచి తన సినిమాలని మన భారతీయ ఇతిహాసాలని స్పూర్తిగా చేసుకొని చేస్తుంటారు. మహాభారతం స్ఫూర్తితోనే బాహుబలి సిరీస్ చేశారు. అలాగే రాముడి, హనుమాన్ పాత్రల స్ఫూర్తితో ఆర్ఆర్ఆర్ సినిమా క్యారెక్టర్స్ ని తీర్చి దిద్దారు. దానికి తగ్గట్లుగానే క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ కూడా రామ, రావణ యుద్ధం తరహాలో డిజైన్ చేశారు. వాటికి చరిత్రక పురుషులైన అల్లూరి, కొమరాం భీమ్ నేపధ్యం తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీని రామాయణంలో హనుమాన్ క్యారెక్టర్ బేస్ చేసుకొని సూపర్ స్టార్ మహేష్ బాబు పాత్రని విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేసారంట.
ప్రపంచంలో అందరికంటే గొప్ప అడ్వంచర్ ట్రావెలర్ ఎవరైనా ఉన్నారంటే కచ్చితంగా హనుమాన్ అని చెప్పాలి భయం లేకుండా ఎలాంటి సాహసాలు అయిన చేసే తత్త్వం హనుమాన్ పాత్రలో ఉంటుంది. దానిని స్ఫూర్తిగా తీసుకొని విజయేంద్రప్రసాద్ మహేష్ బాబు రోల్ ని ఈ మూవీలో డిజైన్ చేసారంట. ఇక ఈ సినిమా హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో పవర్ ఫుల్ కాన్సెప్ట్ తో ఉండబోతోందనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. ఈ మూవీ కోసం హాలీవుడ్ క్యాస్టింగ్ ఏజెన్సీతో ఇప్పటికే రాజమౌళి ఒప్పందం చేసుకున్నారు. దీనిని బట్టి మూవీలో కచ్చితంగా హాలీవుడ్ యాక్టర్స్ ఉంటారని క్లారిటీ వచ్చింది.