SSMB 29: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్ గా ఈ సినిమాలో మహేష్ బాబు కనిపించబోతున్నాడు. అమెజాన్ అడవుల్లో బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే హాలీవుడ్ నటీనటులను కూడా ఎంపిక చేసే ప్రయత్నం రాజమౌళి చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమాతో జక్కన్న ఆస్కార్ అవార్డు అందుకొని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలోని నాటు నాటు పాటకి బెస్ట్ ఒరిజినల్ కేటగిరి విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ అవార్డు ద్వారా రాజమౌళి ఇమేజ్ ఒక్కసారిగా హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళిపోయింది. ఇప్పటికే జేమ్స్ కామెరూన్, స్పిల్ బర్గ్ లాంటి దర్శకులు సైతం ఇమేజినేషన్ దర్శకత్వ ప్రతిభ పై ప్రశంసలు కురిపించారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు హాలీవుడ్ దృష్టి కూడా రాజమౌళి తీయబోయే తర్వాత సినిమాపై ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే సినిమా కచ్చితంగా హాలీవుడ్ రేంజ్ లో ప్రేక్షకులకి రీచ్ అవుతుంది అని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తారు అనే ప్రచారం నడుస్తుంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో సినిమా బిజినెస్ కచ్చితంగా దేశంలోనే హైయెస్ట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తుంది.