టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుడుగా, ఇండియన్ వైడ్ గా తన పాపులారిటీ పెంచుకున్న స్టార్ దర్శకుడుగా రాజమౌళి ఇప్పటికే తన ఇమేజ్ ని ఆకాశమంత ఎత్తులో నిలుపుకున్నాడు. ఇక దర్శకుడుగా ఇండియన్ ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాని రెండు వేల కోట్ల కలెక్షన్ రికార్డ్ ని రాజమౌళి సృష్టించాడు అంటే అది అతని ప్రతిభకి కొలమానం. ఒక సినిమాని ఆడియన్స్ కి నచ్చే విధంగా ఎలా తీయాలి. సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ప్రేక్షకుడి దగ్గరకి దానిని ఎలా చేరువ చేయాలి అనే విషయాలు వర్ధమాన దర్శకులు అందరూ కచ్చితంగా రాజమౌళి దగ్గర నేర్చుకోవాల్సిందే. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే ఇలాగే ఉండాలి అనే బ్రాండ్ ఇమేజ్ ని రాజమౌళి సొంతం చేసుకున్నాడు.
ఇండియన్ కెమరూన్ గా అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. వరుసగా రెండు పాన్ మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో తన సత్తాని నిరూపించుకున్నాడు. హాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఇండియన్ సినిమా గురించి ఇప్పుడు చర్చించుకుంటుంది అంటే ఆ క్రెడిట్ మొత్తం కచ్చితంగా రాజమౌళిది అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇప్పుడు రాజమౌళి అరుదైన గౌరవాన్ని దక్కించుకుంటున్నారు. మొదటి సారి ఒక ఇండియన్ దర్శకుడు తెరకెక్కించిన చిత్రాలు అన్ని కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితం కాబోతుండటం కేవలం రాజమౌళికే దక్కింది.
బియాండ్ ఫెస్ట్ హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో విశేష ఆదరణ పొందింది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఈ వేడుక గ్రాండ్ గా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 11 వరకు జరగనున్న ఈ ఫెస్ట్‌లో టాలీవుడ్ టు హాలీవుడ్ అంటూ ఏర్పాటు చేసిన వేదికపై రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలు ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బియాండ్ ఫెస్ట్ టీమ్ ఓ ట్వీట్ చేసింది. సెప్టెంబర్ 30 నుంచి వరుసగా రాజమౌళి సినిమాలు ఈ ఫెస్ట్ లో ప్రదర్శించనున్నారు. ఆర్ఆర్ఆర్ తీసుకొచ్చిన అంతర్జాతీయ గుర్తింపుతో రాజమౌళికి ఈ అరుదైన గౌరవం ఇప్పుడు దక్కిందని చెప్పాలి.