SS Rajamouli: తెలుగుతోపాటు అన్ని భారతీయ భాషలలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇప్పుడు జపాన్ లో కూడా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదైలై చప్రపంచ వ్యాప్తంగా సినీ లవర్స్ ను ఎంతగానో అలరించిన ఈ సినిమా ఈ నెల 21 నుండి జపాన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి, జూ. ఎన్టీఆర్, రాంచరణ్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే పలు చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు.
జపాన్ లో ఆర్ఆర్ఆర్‌ను ప్రమోట్ చేస్తున్న జక్కన్న జపాన్ వీడియో గేమ్స్ క్రియేటర్ గా పాపులర్ అయిన హిడియో కోజిమాను కలిశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోను రాజమౌళి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. “లెజెండరీ వీడియో గేమ్ క్రియేటర్ కోజిమోను కలవడం సంతోషంతో పాటు గౌరవంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా వీడియో గేమ్స్, సినిమాలతో పాటు పలు విషయాల గురించి ఆయనతో చర్చించాను. ఈ మెమరీస్ ఎప్పటికీ మరచిపోలేను” .. అని ట్వీట్ చేశారు.
Director S.S. Rajamouli visited KJP!!! We have scanned him. RRR🔥🔥🔥🚀🚀🚀👍🐯 pic.twitter.com/rcyatlnXnS
— HIDEO_KOJIMA (@HIDEO_KOJIMA_EN) October 20, 2022
SS Rajamouli: రాజమౌళిపై కోజిమో ప్రశంసలు
అలాగే రాజమౌళి తనను కలిసిన విషయాన్ని కోజిమా సైతం సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రాజమౌళి తనకు అందించిన బహుమతుల ఫోటోలను షేర్ చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి కోజిమా ప్రొడక్షన్స్ స్టూడియోని సందర్శించారని ఆయన తెలిపారు. ఈ స్టూడియోలో రాజమౌళి.. ఒక మనిషిని యొక్క 3D చిత్రాలను రూపొందించడానికి ఉపయోగించే బాడీ స్కానర్ లో కూర్చుని ఉన్న ఫోటోతో పాటు మరికొన్ని చిత్రాలను ఆయన షేర్ చేశారు. “దర్శకుడు రాజమౌళి కేజేపీని సందర్శించారు!!! మేము అతనిని స్కాన్ చేశాం. రాజమౌళి నుంచి నాకు చాలా బహుమతులు కూడా లభించాయి. ఈ డిలైటెడ్ బహుమతులు ఇచ్చిన రాజమౌళికి థ్యాంక్స్” అని ట్వీట్ చేశారు. దీంతో రాజమౌళి త్వరలోనే వీడియో గేమ్స్‌లో కూడా కనిపించనున్నారని తెలుస్తోంది. దీంతో, జక్కనతో మనం ఒక ఆట ఆడేసుకోవచ్చన్నమాట అని నెటిజనులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.