SS Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్లాఫులంటూ లేని స్టార్ డైరెక్టర్ గా, తెలుగు సినిమా కీర్తి ప్రపంచవ్యాప్తంగా వినిపించిన ఘనత సాధించిన డైరెక్టర్ దర్శక ధీరుడు రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ వన్ తో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ వరకు దానిని కొనసాగిస్తూ వచ్చాడు. ఆయన సినిమా తీశాడంటే రికార్డులు తిరిగ రాయాల్సిందే అనే ట్రాక్ రికార్డును రాజమౌళి సొంతం చేసుకున్నాడు.
టాలీవుడ్ లో అప్పటి వరకు సినిమాలకు ఉన్న ట్రెండ్ లకు భిన్నంగా, హీరోయిజంకి సమానంగా విలనిజంని చూపించిన డైరెక్టర్ రాజమౌళి. తెలుగులో బాహుబలి పేరుతో రెండు సినిమాలు చేసి తెలుగు సినిమా పేరును ప్రపంచవ్యాప్తంగా వినిపించేలా చేశాడు ఈయన. ఇప్పుడు ఈయనకు సంబంధించిన ఓ విషయం వైరల్ అవుతోంది.
రాజమౌళి సినిమాల ద్వారా హీరోలకు ఎంతైతే పేరు వస్తుందో, ఆ సినిమా తర్వాత ఆ హీరోకు అన్ని అవకాశాలు వస్తుంటాయి. కానీ ఇది హీరోయిన్ల విషయంలో మాత్రం వేరేలా ఉంటోంది. రాజమౌళి చేసిన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ నుండి ఈమధ్యన తీసిన ‘ఆర్ఆర్ఆర్’ వరకు అన్ని సినిమాల్లో ఇదే జరిగింది.
SS Rajamouli:
సినిమాల రిలీజ్ ల సమయంలో రాజమౌళి సినిమాల్లోని హీరోయిన్లకు మంచి పేరు వచ్చినా కానీ తర్వాత మాత్రం వాళ్లకు గుర్తింపు రావడం లేదు. అయితే ఈ మొత్తం జాబితాలో ఒక్క కాజల్ అగర్వాల్ మాత్రం మినహాయింపుగా ఉంది. ఆమెకు మాత్రం మంచి గుర్తింపు, అవకాశాలు అందాయి. రాజమౌళి సినిమాల్లో చేసిన లైలా, భూమిక, జెనీలియా, శ్రీయ, అనుష్క, ప్రియామణి, సమీర, సమంత, అనుష్క మరియు అలియా భట్ లకు పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు.