Sruthi Hassan : ఒక్క సినిమా హిట్ అయితేనే ముద్దుగుమ్మలు నిలవడం లేదు. పోలో మంటూ రెమ్యూనరేషన్‌ను పరిగెత్తిస్తున్నారు. మరి స్టార్ హీరోయిన్స్ ఆగుతారా? ఇప్పటి వరకూ వెయిట్ చేయడమే పాపం అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. రెమ్యూనరేషన్‌ను కోట్లలో పరుగులు తీయిస్తుంటారు. నిజానికి హీరోయిన్స్ అన్నీ సీక్రెట్సే మెయిన్‌టైన్ చేస్తూ ఉంటారు. ప్రేమ, బాయ్‌ఫ్రెండ్, డేటింగ్ వంటి విషయాల్లో మరింత సీక్రెసీ మెయిన్‌టైన్ చేస్తారు. ఇక పెళ్లి కుదిరినా ఇంతే.. ఎంగేజ్‌మెంట్ అయ్యేవరకూ తెలియనివ్వరు. దీనికి కారణాలు లేకపోలేదు. మీడియా రచ్చ ఒకటైతే.. కెరీర్ ఎక్కడ ఇబ్బందుల్లోపడుతుందోనన్న భయం మరొకటి.
కానీ అలాంటి వాటికి భయపడేదేలే అనే హీరోయిన్స్ కొందరుంటారు. వారిలో శ్రుతిహాసన్ ఒకరు. ఈ అమ్మడికి సీక్రెసీ అంటే ఏంటో కూడా తెలియదు. వ్యక్తిగతమైనా.. వృత్తిగతమైనా.. అన్నీ బహిర్గతమే. అమ్మడు బాయ్‌ఫ్రెండ్స్‌ను మార్చి పడేస్తూనే ఉంటుంది. వృత్తిపరంగానూ ఈ ముద్దుగుమ్మ సెన్సేషనలే. అవసరమైతే ఎలాంటి గ్లామర్ రోల్‌కైనా వెనుకాడదు. అందుకే అమ్మడికి ఆఫర్స్ కూడా బాగానే వస్తున్నాయి. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ అవకాశాలను పట్టేస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్‌ను రప్ఫాడించేస్తోంది.
Sruthi Hassan : అమ్మడు చిటారు కొమ్మన కూర్చొందట..
అటు ప్రభాస్‌తో సలార్.. ఇటు చిరంజీవితో వాల్తేరు వీరయ్య.. మరోవైపు బాలకృష్ణ సరసన ఒక చిత్రం.. ఇక ఇంత పెద్ద హీరోల సరసన అవకాశం కొ్ట్టేశాక అమ్మడు ఊరుకుంటుందా? పారితోషికం విషయంలో తగ్గేదేలే అంటున్నట్టు సమాచారం. ఇంతకు ముందు నటించిన చిత్రాలు మంచి సక్సెస్ సాధించడంతో పాటు ఒకరు ప్యాన్ ఇండియా స్టార్ కాగా.. మరో ఇద్దరు టాలీవుడ్‌లోనే టాప్ హీరోలతో సినిమా చేస్తుండే సరికి అమ్మడు చిటారు కొమ్మన కూర్చొందట. దిగి రావాలంటే.. రూ. 2.5-3 కోట్ల వరకూ డిమాండ్ చేస్తోందట. అసలే ఇండస్ట్రీలో నిర్మాతలు ఒకవైపు ఖర్చు తగ్గించుకోవాలని నానా తంటాలు పడుతుంటే అమ్మడు మాత్రం తగ్గేదేలే అంటోందట.