స్టార్ హీరోయిన్ గా సౌత్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి శృతి హాసన్. కమల్ హసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రుతి హసన్ కెరియర్ ఆరంభంలో కాస్తా ఫెయిల్యూర్ లని చూసిన తర్వాత సక్సెస్ ట్రాక్ ఎక్కి వరుస విజయాలు సొంతం చేసుకోవడంతో పాటు స్టార్ హీరోలు అందరితో ఆడిపాడింది. ప్రస్తుతం ఓ వైపు ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ సలార్ లో హీరోయిన్ గా నటిస్తూనే మరో వైపు బాలకృష్ణకి జోడీగా గోపీచంద్ మలినేని చిత్రంలో కూడా చేస్తుంది. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే శృతి హాసన్ హసన్ మంచి యాక్టర్ మాత్రమే కాదు. మంచి మ్యూజిక్ డైరెక్టర్, అలాగే అద్బుతమైన గాయని కూడా, అదే సమయంలో యాక్షన్, క్లాసికల్ డాన్స్ లో కూడా ఈ బ్యూటీకి ప్రావీణ్యం ఉంది. ఇలా మల్టీ టాలెంటెడ్ గా శృతి తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. సొంతగా ఒక బ్యాండ్ ని మెయింటేన్ చేస్తుంది. ఈ బ్యాండ్ తో విదేశాలలో మ్యూజికల్ కన్సర్ట్స్ కూడా నిర్వహిస్తూ ఉంటుంది. అలాగే శృతి హాసన్ లో మంచి రైటర్ కూడా, అలా తానె సొంతంగా పాటలు రాసుకొని వాటిలో పాడి వీడియో షూట్ చేసి తన యుట్యూబ్ చానల్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి పాటలకి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.
సోషల్ ఎలిమెంట్ తీసుకొని వాటి మీద మంచి పాట రాసి వీడియో షూట్ చేసి పెట్టడం ఆమెకి అలవాటు. చాలా గ్యాప్ తర్వాత శృతి హాసన్ మరల ఒక వీడియో సాంగ్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సాంగ్ ప్రస్తుతం యుట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఆడపిల్లల గురించి చెబుతూ షీ ఈజ్ ఎ హీరో అనే కాన్సెప్ట్ తో ఈ వీడియో సాంగ్ అప్లోడ్ చేసింది. అందులో బ్లాక్ డ్రెస్ లో ఓ వైపు మ్యూజిక్ కంపోజ్ చేస్తూ మరో వైపు పాడుతూ, డాన్స్ చేస్తూ సందడి చేసింది. ఈ వీడియోలో ఆమె ఇచ్చే మెసేజ్ చాలా మందికి కనెక్ట్ అయ్యింది. పాశ్చాత్యా సంగీతం, ఇంగ్లీష్ సాంగ్స్ ఎక్కువగా ఇష్టపడే వారికి శృతి హసన్ రిలీజ్ చేసిన ఈ సాంగ్ భాగా నచ్చుతుంది.