Bigg boss 6 : బిగ్ బాస్ హౌస్‌లో ఫ్యామిలీ ఎపిసోడ్ కోసం చూడని వారు ఎవరుంటారు? హౌస్‌మేట్స్‌కేమో ఆత్మీయులు తమ ఆటతీరుపై ఏం చెబుతారోనన్న ఆసక్తి.. ప్రేక్షకులకేమో కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ను చూడాలన్న ఆసక్తి వెరసి ఫ్యామిలీ ఎపిసోడ్ మాంచి కిక్ ఇస్తుంది. ఈ వీక్ కోసం ప్రత్యేకంగా కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్లను బిగ్‌బాస్ హౌస్‌లో నుంచి పోనివ్వరు. అది ఎందుకనేది నేటి ఎపిసోడ్ చూస్తే అర్ధమవుతుంది. ఈ రోజు శ్రీ సత్య కోసం ఆమె తల్లిదండ్రులు వచ్చారు. నిజానికి ఆమె తల్లి పరిస్థితిని చూసిన వారెవరికైనా గుండె ద్రవిస్తుంది. అమ్మ సెంటిమెంట్ అంత స్ట్రాంగ్.
శ్రీ సత్య తల్లి కొన్నేళ్లుగా వీల్ చైర్‌తోనే ఎక్కువగా సావాసం చేస్తోంది. కదల్లేని పరిస్థితి ఆమెది. దీంతో ఆమె అదే వీల్ చైర్‌లో హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఇక శ్రీ సత్య తన తల్లి కూడా నడిస్తే బాగుండు అని కన్నీళ్లు పెట్టుకుంటున్న సమయంలో ఆమె తల్లి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్‌బాస్ నిర్వాహకులు సైతం ‘అమ్మా.. అమ్మా’ అనే సాంగ్ వేసి ప్రేక్షకుల కళ్లు చెమ్మగిల్లేలా చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో కొద్ది సేపటి క్రితం విడుదలైంది. కంటెస్టెంట్స్ ఆమె వీల్ చైర్‌ని హౌస్‌లోకి ఎత్తి తీసుకుని వాచ్చారు. తల్లికి భోజనం తినిపిస్తూ శ్రీ సత్య బాగా ఎమోషనల్ అయిపోయింది.
ఇక శ్రీ సత్య తండ్రి మాత్రం చాలా జెన్యూన్‌గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు. రాజ్ తనను ఫస్ట్ వీక్.. సరైన పాయింట్ లేకుండా నామినేట్ చేశాడని చెప్పడంతో శ్రీ సత్య తండ్రి ‘నువ్వు చేసేవి కూడా పిచ్చి పిచ్చి నామినేషన్‌లే’ అని చెప్పారు. దీంతో శ్రీసత్య అవాక్కైంది. మొత్తానికి ఒక్కొక్కరి గ్రాఫ్ ఉవ్వెత్తున లేచే ఎపిసోడ్ ఇది. మిగిలిన వారికేమో కానీ శ్రీ సత్యకు మాత్రం సరైన టైంలో సరైన ఎపిసోడ్ పడింది. శ్రీ సత్యపై ఉన్న నెగిటివిటీ మొత్తం అమ్మ సెంటిమెంటులో కొట్టుకుపోయింది. ఇప్పటి వరకూ శ్రీ సత్య బయటకు వెళ్లకుండా బిగ్‌బాస్ అడ్డుకుంటే ఈ వారం మాత్రం ఆమె తల్లిదండ్రులు అడ్డుకున్నారు.