BIGG BOSS: బిగ్ బాస్ హౌస్ లో అర్జున్ కనెక్ట్ అవడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ శ్రీసత్య మాత్రం ఎప్పటికప్పుడు దూరం పెడుతూనే వస్తున్న విషయం అందరికీ తెలిసిందే..! కానీ టాస్క్ లో భాగంగా అవసరం ఉన్నప్పుడు మాత్రం అర్జున్ ని వీర లెవల్ లో వాడేసుకుంటోంది శ్రీసత్య. తానకు కనెక్ట్ అవ్వడానికి ఇష్టం లేదని ఇప్పటికే చాలాసార్లు శ్రీసత్య చెప్పినప్పటికీ అర్జున్ మాత్రం తన ప్రయత్నాలను విరమించుకోకుండా ముందుకు సాగుతూ వచ్చాడు. వీరిద్దరి వ్యవహారం బిగ్ బాస్ కి బాగానే కంటెంట్ ఇచ్చినప్పటికీ అర్జున్ కి మాత్రం ప్రతి వారం మైనస్ గానే మారుతూ వస్తోంది.
లాస్ట్ వీక్ లో శ్రీసత్య, శ్రీహాన్ కలిసి ఓ రేంజ్ లో డ్యాన్సులు వేశారు. దీంతో అర్జున్ తెగ ఫీల్ అయిపోతాడు. దీనికి తోడు ఓ టాస్క్ లో తనకు దెబ్బలు తగిలితే శ్రీసత్య ఆలస్యంగా పలకరించిందని అర్జున్ తెగ బాధ పడిపోతాడు. దీంతో ఈ వ్యవహారం గురించి కేవలం వారిద్దరు మాత్రమే కూర్చోని తెల్చేసుకున్నారు. శ్రీసత్య నిర్మోహమాటంగా తన మనసులో విషయాన్ని బయటపెట్టింది.
బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వచ్చావు.. ఇక్కడ ఏం చేస్తున్నావని అర్జున్ ని తిడుతుంది. అంతేకాదు… తనకు ఎవరితో అవసరం లేదని తన కుటుంబం మాత్రం ఉంటే చాలని శ్రీసత్య తనదైన శైలిలో అర్జున్ అంటే తనకి ఇష్టం లేదని తేల్చిపారేస్తుంది. నేను కూడా రియలైజ్ అయ్యాను.. సో ఇక నుండి నీపై ఎలాంటి హోప్స్ పెట్టుకోనని అర్జున్ కూడా తన మనసులో మాటను శ్రీసత్యకు చెప్పేస్తాడు. లాస్ట్ వీక్ లో నామినేషన్స్ లో ఎవరు సేఫ్ అవ్వాలి, ఎవరు అవకూడదు అనేది వీరిద్దరి మధ్య చర్చ జరిగినప్పుడు కూడా అర్జున్ కాంప్రమైజ్ అవుతాడు. దీంతో శ్రీసత్య సేవ్ అవుతుంది. అర్జున్ నామినేషన్స్ లో ఉంటాడు.
ఈ ఆదివారం ఎపిసోడ్ ఆ నామినేషన్స్ కి సంబంధించి సేవ్ చేసే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో అర్జున్ వంతు వస్తుంది. అప్పుడు శ్రీసత్య అర్జున్ సేవ్ అవ్వడేమో అన్నట్లుగా తన ఊపుతుంది. కానీ ఊహించని విధంగా అర్జున్ ఈ వారం నామినేషన్స్ నుండి సేవ్ అవుతాడు. ఆ తర్వాత శ్రీసత్య మోహంలో ఎలాంటి ఎక్స్ ప్రేషన్స్ ఉండవు. దీంతో అర్జున్ సేవ్ అయినందుకు శ్రీసత్య హ్యాపీనా… అన్ హ్యాపీనా అనేది ఎవరికీ అర్ధం కాదు. ఈ విషయం తెలియాలంటే ఈ వీక్ బిగ్ బాస్ షో చూడాల్సిందే..?!