స్టార్ దర్శకుడుగా వరుస హిట్స్ తో దూసుకెళ్లి ఒక్కసారిగా క్రిందపడిపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీనువైట్ల. కమర్షియల్ ఎంటెర్టైనర్స్ తో ఈ దర్శకుడు వరుస హిట్స్ సొంతం చేసుకున్నాడు. ఆగడు సినిమా నుంచి అతని ఫేట్ మారిపోయింది. ఆ మూవీతో పాటు తరువాత చేసిన రెండు సినిమాలు అతని ఖాతాలో డిజాస్టర్స్ గా పడ్డాయి. అయితే ఆ ఫ్లాప్ లు కేవలం శ్రీనువైట్ల అతి విశ్వాసం వలన వచ్చినవే అని హీరోలు భావించడంతో మళ్ళీ అతనితో వర్క్ చేయడానికి స్టార్ హీరోలు ఎవరూ ముందుకి రాలేదు. దీంతో అతని డైరెక్షన్ కి చాలా గ్యాప్ వచ్చేసింది. ఆ మధ్య ఢీ సీక్వెల్ ని ఎనౌన్స్ చేసిన ఎందుకనో మళ్ళీ ఆ మూవీ పట్టాలెక్కలేదు.
మంచు విష్ణు కూడా దానిపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే మళ్ళీ శ్రీను వైట్ల తన రైటర్ గోపి మోహన్ తో కలిసి వర్క్ చేయడానికి సిద్ధం అయ్యాడు. అతని సపోర్ట్ తీసుకొని ఒక కథని సిద్ధం చేసుకొని రవితేజకి వినిపించినట్లు టాక్. ఇక కథ బాగానే ఉండటంతో రవితేజ కూడా అతనికి ఒకే చెప్పాడని తెలుస్తుంది. బ్రూస్ లీ తర్వాత శ్రీను వైట్ల మీద నమ్మకంతో రవితేజ అతనికి అవకాశం ఇచ్చాడు. అమర్ అక్బర్ అంటోనీ రూపంలో వారి కాంబోలో వచ్చిన సినిమా డిజాస్టర్ అయ్యింది.
అయితే మళ్ళీ శ్రీను వైట్ల టాలెంట్ ని నమ్మి రవితేజ మరో అవకాశం అతనికి ఇచ్చినట్లు తెలుస్తుంది. వీరి కాంబినేషన్ లో సినిమా ఈ ఏడాది ఆఖరులో పట్టాలు ఎక్కే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం రవితేజ సుదీర్ వర్మతో రావణాసుర, త్రినాథ్ రావ్ తో ధమాకా సినిమాలు చేస్తున్నాడు. వీటితో పాటు వంశీ కృష్ణ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా ఇది. ఈ మూడింటి తర్వాత శ్రీనువైట్లతో సినిమా ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది.