Srinidhi Shetty: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ శ్రీనిధి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట మోడల్ గా కెరీర్ ను ఆరంభించిన శ్రీనిధి శెట్టి ఆ తర్వాత సినిమా అవకాశాలు హీరోయిన్ గా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. మొదటి సినిమా ఏకంగా పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకోవడంతో పాటుగా పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా మారిపోయింది.
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అలాగే కన్నడ సూపర్ స్టార్ యష్ కాంబినేషన్ తెరకెక్కిన కేజీఎఫ్ ఛాప్టర్ 1,కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలతో ఊహించని విధంగా పాపులారిటీనీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
మొదటి సినిమాతోనే పాన్ ఇండియన్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడంతో ఈమెకు వరుసగా అవకాశాలు వస్తాయి అని అందరూ భావించారు. కేజిఎఫ్ సినిమా తరువాత హీరో విక్రమ్ నటించిన కోబ్రా సినిమాలో నటించింది.
కానీ కేజిఎఫ్ సినిమా విడుదల అయ్యి కొన్ని నెలలు పూర్తి అవుతున్నా కూడా ఇంతవరకు ఈమెకు సరైన అవకాశాలు కూడా రాలేదు.కాగా కే జి ఎఫ్ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అదే జోష్ తో సోషల్ మీడియాలోనూ సత్తాను చూపిస్తోంది.
ఈ మేరకు ట్రెండ్ కీ తగ్గట్టుగా ఫొటోషూట్లతో నెటిజన్లను ఆకర్షిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో అందాల విందు చేస్తోంది. అలాగే మత్తెక్కించే చూపులతో, మతిపోయే పోజులతో ఫొటోషూట్లు చేస్తూ కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
ఈమెని ట్రెండింగ్ తగ్గట్టుగా స్టైలిష్ గా అయినా ట్రెడిషనల్ గా అయినా చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు అభిమానులు. ఇక ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలకు లక్షల్లో లైక్స్ వేలలో కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఇలా ఉంటే తాజాగా శ్రీనిధి శెట్టి తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె రెడ్ కలర్ శారీలో తన నడుము అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. ఎర్ర చీర,స్లీవ్ లెస్ జాకెట్ ను ధరించి బాడీ షేప్స్ చూపిస్తు యువత దృష్టిని తన వైపుకు తిప్పుకుంటోంది.