Srinidhi Shetty: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ శ్రీనిధి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కాగా ఈమె మొదట్లో మోడల్ కెరిర్ ను మొదలు పెట్టింది. ఆ తరువాత ఈమె సినీ అవకాశాలు ప్రారంభమయ్యాయి. తొలి చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా పాన్ ఇండియన్ హీరోయిన్ గా మారిపోయింది. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కన్నడ సూపర్ స్టార్ యష్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కేజీఎఫ్ ఛాప్టర్ 1, కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాలో హీరోయిన్ గా నటించింది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా నటించిన కేజిఎఫ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో హీరో యష్ సరసన నటించింది శ్రీనిధి.
ఈ సినిమాలో ఆమె నటన గాను మంచి మార్కులే పడ్డాయి. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం వరుస అవకాశాలు వచ్చి చేరుతున్నాయి. ఇకపోతే ఈమె ఇటీవల విడుదల అయినా కోబ్రా సినిమాతో ప్రేక్షకులకు పలకరించింది.
ఇందులో విక్రమ్ హీరోగా నటించాడు. అయితే కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
వరుసగా ట్రెండింగ్ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో అందాల విందు చేస్తోంది. మత్తేకించి చూపులు, మతిపోయే పోజులతో ఫొటోషూట్లు చేస్తూ కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ఈ ముద్దుగుమ్మ తన ఇంస్టాగ్రామ్ కథలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అప్పుడు శ్రీనిధి వైట్ కలర్ ఫుల్ లెన్త్ డ్రెస్ ను ధరించింది. ఆ వైట్ కలర్ డ్రెస్ కి రంగురంగుల పూలు కూడా ఉన్నాయి. పద్ధతిగా డ్రెస్ వేసుకొని నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.