కేజీఎఫ్ సిరీస్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్ లో పాపులర్ అయిన అందాల భామ శ్రీనిధి శెట్టి. మంగళూరుకి చెందిన ఈ అమ్మడు అందాల పోటీలలో రాణించి తరువాత నటిగా కెరియర్ ప్రారంభించింది. మొదటి సినిమానే ఏకంగా రాకింగ్ స్టార్ యష్ లాంటి హీరో పక్కన రావడంతో ఈ అమ్మడు ఆనందానికి అవధులు లేవు. కేజీఎఫ్ లో రాకీభాయ్ లవర్ గా మొదటి భాగంలో కనిపించింది కొద్దిసేపే అయినా బాగా పాపులర్ అయ్యింది. ఆ సినిమా ఇచ్చిన క్రేజ్ తో ఒక్కసారిగా సౌత్ దర్శకుల దృష్టి ఈమెపై పడింది. ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 లో రాకీభాయ్ ప్రియురాలిగా, భార్యగా కనిపించి కాస్తా నిడివి ఉన్న పాత్రలోనే మెప్పించింది.
ఇక సిరీస్ తర్వాత చియాన్ విక్రమ్ కి జోడీగా అవకాశాన్ని సొంతం చేసుకోవడంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయానని ఈ అమ్మడు భావించింది. దీంతో దర్శక, నిర్మాతలు శ్రీనిధి డేట్స్ కోసం ట్రై చేస్తే ఏకంగా ఐదు కోట్లు రెమ్యునరేషన్ ఇస్తే చేస్తానని కండిషన్స్ పెట్టినట్లు టాక్. అయితే రెండు సినిమాల అనుభవం, పెద్దగా నటిగా ప్రూవ్ చేసుకొనే పాత్రలు కాకపోవడంతో దర్శకులు ఆ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. దీంతో చేతిలోకి వచ్చిన అవకాశాలు కూడా శ్రీనిధి కోల్పోయింది.
ఇక చియాన్ విక్రమ్ కి జోడీగా నటించిన కోబ్రా మూవీ ఒక్క తమిళ్ లో తప్ప అన్ని భాషలలో ఫెయిల్ అయ్యింది. దీంతో ఈ అమ్మడు కెరియర్ మళ్ళీ మొదటికి వచ్చింది. దీంతో ఇప్పుడు అవకాశాల కోసం ట్రై చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. కేజీఎఫ్ సక్సెస్ తర్వాత ఏకంగా ఐదు కోట్లు డిమాండ్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు కోటి రూపాయిలు రెమ్యునరేషన్ ఇచ్చిన చేయడానికి రెడీ అని నిర్మాతలకి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. మరి శ్రీనిధి ఆఫర్ నచ్చి దర్శక, నిర్మాతలు ఆమెకి అవకాశం ఇస్తారేమో చూడాలి. ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు బోగట్టా.