Bigg boss 6: బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు ఈ వారం కాస్త సందడిగా సాగుతోంది. గత నాలుగు వారాలతో పోలిస్తే ఈ వారం ఎంటర్‌టైన్‌మెంట్ పర్వాలేదనిపిస్తోంది. బిగ్‌బాస్ తన పుట్టిన రోజు అని చెప్పి రెండు రోజుల పాటు తనను ఎంటర్‌టైన్ చేసే బాధ్యతను కంటెస్టెంట్స్‌కి అప్పగించాడు. దీనిలో భాగంగా రెండు రోజుల పాటు హౌస్ సందడి సందడిగా సాగింది. ఇక నేటి ప్రోమోను స్టార్ మా యాజమాన్యం విడుదల చేసింది. దీనిలో భాగంగా రెండు రోజుల పాటు కంటెస్టెంట్స్ బిగ్‌బాస్ కోరికలన్నీ నెరవేర్చారని.. అయితే నేడు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ కోరికలు తెలుసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పాడు.
దీనిలో భాగంగా ఒక్కొక్కరు తన కోరికలను చెప్పడం మొదలు పెట్టారు. ఒక్కొక్కరి కోరికను వింటూ అంతా బాగా ఎమోషనల్ అయ్యారు. ఈ ప్రోమోలో తొలుత శ్రీహాన్ మాట్లాడుతూ.. సిరీకి ఒక మెసేజ్ అందజేశాడు. ఆమె షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా కూడా రోజుకు ఒక్కసారైనా తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడాలని.. వారు ఎలా ఉన్నారో కనుక్కోవాలని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఏం జరిగినా చూసుకోవడానికి నువ్వున్నావన్న ధైర్యం ఇవ్వమని సిరిని కోరాడు. దీంతో మిగిలిన కంటెస్టెంట్స్ సైతం ఎమోషనల్ అయ్యారు.
ఆ తరువాత సుదీప తన భర్త గురించి తలుచుకుని ఎమోషనల్ అయ్యింది. ఇక రేవంత్ తన వైఫ్‌ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని తన తల్లిదండ్రులకు సూచించాడు. వాళ్లంతా అక్కడ హ్యాపీగా ఉంటేనే హౌస్‌లో తను కూడా హ్యాపీగా ఉంటానని తెలిపాడు. బిగ్‌బాస్‌ని తన భర్త ఫోటో పంపించమంటే పంపించాడంటూ అది పట్టుకుని ఆవేదన వ్యక్తం చేసింది. తన ఎంటైర్ లైఫ్‌లో తన తండ్రితో మాట్లాడింది చాలా తక్కువని సూర్య ఎమోషనల్ అయ్యాడు. ఇక తన తండ్రిని తలుచుకుని అర్జున్.. డాడీలా నిన్ను చూసుకోలేను కానీ డాడీ లేని లోటు లేకుండా చూసుకుంటానంటూ ఇనయా ఎమోషనల్ అవుతుంది.