Srihan : బిగ్‌బాస్ సీజన్ 6.. వామ్మో ఎవరికి వాళ్లు తగ్గేలేలా లేరు అన్నట్టుగా ఉంది. ఏ టాస్క్ జరిగినా రచ్చ రంబోలా తప్పట్లేదు. బిగ్‌బాస్‌కి మాత్రం కావల్సినంత కంటెంట్ ఇస్తున్నారు కంటెస్టెంట్స్. రెండోవారం కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్.. కంటెస్టెంట్స్‌కి సిసింద్రి టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. నిన్న జరిగిన ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్‌లో పాల్గొన్న ఫైమా, రేవంత్, చలాకి చంటిలో అందరికంటే ముందు టాస్క్ కంప్లీట్ చేసి తొలి కెప్టెన్సీ పోటిదారుడిగా నిలిచాడు చంటి. ఇక రాత్రి కావడంతో కెప్టెన్సీ టాస్క్‌ని ఆపేశాడు బిగ్‌బాస్. టాస్క్ సమయం పూర్తయినందుకు తదుపరి ఆదేశం వరకు తమ బేబీ బొమ్మలను ప్రతి కంటెస్టెంట్ జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆదేశం ఇచ్చాడు. అయితే బొమ్మలను దాచుకోవడానికి వీలు లేదంటూ చివరిలో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్.
ఇక అప్పటికే గలాటా గీతూ రేవంత్, అభినయశ్రీ సహా కొందరి బొమ్మలను లాస్ట్ అండ్ ఫౌండ్‌లో పడేసింది. దీంతో వాళ్లు టాస్క్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఈ రోజు జరిగే ఎపిసోడ్‌కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను తాజాగా వదిలాడు బిగ్‌బాస్. ఈ తాజా ప్రోమోలో గలాట గీతూ తన చేతివాటం చూపించింది. రాత్రంత నిద్ర పోకుండా బొమ్మలు దొంగలించేందుకు ప్రయత్నించింది. అందులో భాగంగా కెప్టెన్ ఆదిత్య బొమ్మను దొంగలించి తీసుకెళుతుండగా.. ఇంటి సభ్యులు ఆమెను అడ్డుకుని ఆదిత్యను బతికించారు. ఇక శ్రీహాన్ కూడా చేతివాటం ప్రదర్శించాడు. నిద్ర పోతున్న అర్జున్ దగ్గర నుంచి బొమ్మను లేపేసి లాస్ట్ అండ్ ఫౌండ్‌లో వేశాడు.
Srihan : గీతూ గలాటాకు రాత్రంతా నిద్రపోని కంటెస్టెంట్స్
ఇక సమయం కోసం కాచుకు కూర్చున్న గీతూ.. ఇద్దరిని టార్గెట్ చేసింది. వారిలో ఒకరైన శ్రీహాన్ బొమ్మను దొంగలించి లాస్ట్ అండ్ ఫౌండ్‌లో పెట్టేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రోమోను చూసి ఏ విషయాన్ని డిసైడ్ చేయలేం కాబట్టి అసలు గీతూ పడేసింది శ్రీహాన్ బొమ్మనేనా..? అతను తన బొమ్మను కాపాడుకున్నాడా? వంటి అంశాలు ఎపిసోడ్ చూస్తేనే తెలుస్తోంది. మొత్తానికి గీతూ గలాటా చూసి హౌస్ మేట్స్‌లో సగం మంది రాత్రి మూడు గంటల వరకు పడుకోలేదు. మొత్తంగా గీతూ ఈ టాస్క్‌ను మాత్రం అదరగొట్టేసింది. ఆట ఆడుతుందో లేదో కానీ దొంగాటలో మాత్రం ఆరితేరిపోయినట్టు కనిపిస్తోంది.