Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 ముగింపు దశకు వచ్చేసింది. 13వ వారంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 13వ వారం బిగ్‌బాస్ టికెట్ టు ఫినాలే టాస్క్‌ని పెట్టాడు బిగ్‌బాస్. దీని కోసం హౌస్‌లో ఉన్న 8 మంది కంటెస్టెంట్లు పోటీ పడుతున్నారు. ఇక ఈ టికెట్ టు ఫినాలే టాస్క్‌లో గెలిచిన వాళ్లకు ఎలిమినేషన్ ఉండదు. నేరుగా ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని ఛాలెంజ్‌గా తీసుకుని ఆడుతున్నారు. ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులకి ‘స్నో మెన్’ అనే టాస్క్‌ను బిగ్‌బాస్ ఇచ్చాడు.
టాస్క్ లో భాగంగా స్నో మెన్‌ను రూపొందించాలి. దీనికి అవసరమైన ముక్కలను పై నుంచి విసిరే ఏర్పాటు చేశాడు. అంతా వాటిని తీసుకుని స్నోమెన్‌ని రెడీ చేయాలి. దీనికి సంచాలక్‌గా ఇనయాను నియమించడం జరిగింది. టాస్క్‌కి సంబంధించి ఫస్ట్ పార్ట్‌లో రేవంత్, ఆదిరెడ్డి ఎక్కువ ముక్కలను సేకరించి స్నోమెన్‌ని నిర్మించారు. రోహిత్, ఫైమా, కీర్తి మాత్రం ఆట నియమాలనే మార్చేశారు. తాము సేకరించిన వస్తువులను తమ దగ్గరే పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ఇనయ కూడా గుర్తించలేదు. దీంతో బిగ్‌బాస్ ఇనయాను తొలగించి సంచాలక్‌గా రేవంత్‌ని నియమించాడు.
ఆ తర్వాత రెండో లెవల్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇప్పటి వరకూ ఉప్పు, నిప్పులా ఉన్న ఇనయా, శ్రీహాన్‌లు కలిసిపోయి కనిపించారు. శ్రీహాన్ బొమ్మపై ఇనయా దాడి చేసే యత్నం చేయగా.. ఆమెను శ్రీహాన్ గట్టిగా హత్తుకుని మరీ అడ్డుకున్నాడు. ఇనయా కూడా సైలెంట్‌గా ఉండిపోయింది. నిజానికి ఇలాంటివే కొంపలు కూల్చేస్తాయి. వెంటనే శ్రీసత్య ఆట పట్టించడం మొదలు పెట్టింది. అది ఎటాక్‌లా లేదని.. దొరికి పోయావంటూ శ్రీహాన్‌ని ఆట పట్టించింది. రేవంత్, ఫైమాలు వారిద్దరినీ ఇమిటేట్ చేసి మరీ చూపించారు. ఇక శ్రీహాన్ ఏమైనా తగ్గాడా? ఈ ఘటనను మగధీర మూవీతో పోలుస్తూ.. సత్య మిత్రవింద అని.. ఇనయ ఐటెం గర్ల్ అని చెప్పడంతో ఇనయ కాస్త నొచ్చుకుంది. వెంటనే ఆమెను కూల్ చేసేందుకు వారిద్దరి క్యారెక్టర్స్ తిరిగి మార్చేశాడు.