Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు విషయానికి వస్తే ఇవాళ కొంచెం ఆసక్తికరంగానే అనిపిస్తోంది ఎపిసోడ్. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను బిగ్‌బాస్ విడుదల చేశారు. ఆ ప్రోమో చాలా ఫన్నీ ఫన్నీగా ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్ అని బిగ్‌బాస్ స్టార్టింగ్‌కి ముందే హోస్ట్ నాగార్జున చెప్పారు కానీ ఎంటర్‌టైన్‌మెంట్ అనే దానికి కనీసం అవకాశమే లేకుండా పోయింది. కానీ ఇవాళ్టి ప్రోమోను బట్టి చూస్తే మాత్రం కాస్త ఎంటర్‌టైనింగ్ గానే ఉంది.
బిగ్‌బాస్ ఇవాళ తన పుట్టిన రోజు అని.. కాబట్టి అంతా తనను ఎంటర్‌టైన్ చేయాలని కోరాడు. దీనిలో భాగంగా సూర్య మెగాస్టార్ చిరంజీవి మాదిరిగా డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా బిగ్‌బాస్ గీతూని ఆడుకున్న తీరు చూస్తే మాత్రం నవ్వు ఆపుకోలేరు. చికెన్ పీస్ ముందు పెట్టి మరీ గాసిప్ చెబితే తినవచ్చంటూ గీతూతో రకరకాలుగా ఆడుకున్నాడు. ఇక శ్రీ సత్య, శ్రీహాన్ కలిసి ‘సీతారామం’ సినిమాలో అద్భుతమైన పాటకు డ్యాన్స్ చేశారు.
‘ఓ సీతా.. వదలనిక తోడుంటా’ సాంగ్‌కి సత్య, శ్రీహాన్ ఇద్దరూ డ్యాన్స్ చేశారు. నిజానికి ఆ సాంగ్‌కి వారిద్దరూ రియల్ కపుల్ మాదరిగా లీనమై మరీ డ్యాన్స్ చేశారు. వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. బయట ఉన్న శ్రీహాన్ ప్రియురాలు సిరి ఈ సాంగ్ చూస్తే ఆమె పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ బిగ్‌బాస్ హౌస్‌లో కూర్చొని వీరిద్దరి రొమాంటిక్ సాంగ్‌ని చూస్తున్న అర్జున్‌కు మాత్రం బాగా మండిపోయి ఉంటుంది. కెమెరాలు కూడా అటు వారిద్దరి డ్యాన్స్.. ఇటు అర్జున్‌పైనే ఫోకస్ పెట్టాయి. ఇక అర్జున్ ఫేస్ చూడాలి. అయ్యో పాపం అనిపిస్తుంది ఎవరికైనా. అసలే మనోడు నామినేషన్‌రా బాబోయ్ అన్నా కూడా సత్యను బతిమాలుకుంటున్నాడు తప్ప గట్టిగా ఆర్గ్యూ చేయలేకపోయాడు. శ్రీసత్యపై అంత ఎఫెక్షన్ చూపిస్తున్న అర్జున్‌కి ఇది నిజంగా గుండె పగిలిపోయే సీనే.