Bigboss 6 : బిగ్‌బాస్‌లో అసలు మజా ఉండేది సోమవారం నాడే.. నామినేషన్స్ రచ్చతో హౌస్ హీటెక్కిపోతుంది. గత రెండు వారాలు చప్ప చప్పగా సాగిన నామినేషన్స్ ఈ సోమవారం మాత్రం మంటలు రేపాయి. మూడోవారం నాటి నామినేషన్స్‌కి ముందు రాజ్-ఆరోహిల మధ్య నిద్ర గురించి.. కుక్కలు అరవడం గురించి పంచాయితీ నడిచింది. సోమవారం నాటి ఎపిసోడ్ 19 హైలైట్స్ విషయానికి వస్తే.. ఆరోహి-రాజ్‌లు నిద్ర గురించి పంచాయితీ పెట్టుకుంటే రేలంగి మామయ్య అదేనండి మన బాలాదిత్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశాడు. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఆదేశం ప్రకారం శ్రీ సత్యని జైలులో వేశారు.
ఆమె జైలుకి పోతే మన కార్తీకదీపం పాప కీర్తి ఏడవడం మొదలుపెట్టింది. అమ్మడికి అసలే ట్యాంకు నెత్తిపైన ఉంటుంది. ఆ తరువాత వాసంతి, ఆరోహిలు నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నారు. ఇద్దరూ కలిసి వేరే వాళ్లపై విమర్శలు గుప్పిస్తున్న తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. హౌస్‌లో వాళ్లు చాలా డిఫరెంట్‌గా ఉంటున్నారని.. వీళ్ల అద్భుతమైన పెర్ఫామెన్స్‌లను తట్టుకోలేకపోతున్నానని ఆరోహి పెద్ద జోక్ వేసింది. నిజానికి అసలు పెర్ఫామర్ ఆమెనే కదా. చక్కగా ఆడుతున్న ఆ ఆర్జే సూర్యని ఆటని సైతం తగబెడుతోంది. అతని దగ్గరకుపోయి.. ఈ ఇంట్లో ఉన్న వాళ్లలో చాలామందికి ఆడాలన్న కసి లేదు.. రేవంత్ మాత్రం గేమ్‌లో అదరగొడుతున్నాడు అని అన్నది.
Bigboss 6 : శ్రీ సత్య బిల్డప్ వేరే లెవల్..
అర్జున్ కల్యాణ్ అయితే.. శ్రీ సత్య దగ్గర పులిహోర కలపడం మానడం లేదు. ఆమె జైలులో ఉంటే.. మనోడు బయట పడికాపులు కాస్తూ కనిపించాడు. అసలే అమ్మడి బిల్డప్స్ పీక్స్‌లో ఉంటాయి. ఈ క్రమంలో అయితే శ్రీ సత్య బిల్డప్ వేరే లెవల్. ఇక్కడ మరో కామెడీ ఏంటంటే.. నాలో ఉన్న నెగిటివ్స్ ఏంటి?.. ఏం సరిదిద్దుకోవాలి? అని గీతూని అడిగితే.. ఓవర్‌గా అగ్రిసివ్ అయిపోతున్నావ్ అని గీతు చెప్పింది. అగ్రిసివ్ గురించి.. ప్రవర్తన గురించి.. మైండ్ సెట్ గురించి గీతూ సలహాలివ్వడం ఏంటి? వినేవాడుంటే ఎన్నైనా చెబుతారు కదా. శ్రీ సత్య గీతుతో మాట్లాడుతూ.. తాను ఇక్కడికి డబ్బుకోసమే వచ్చానని.. డబ్బుకోసం వచ్చాను కాబట్టి నన్ను నేను మార్చుకోలేను అని చెప్పింది.