Bigg boss 6 : ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క. ప్రమాణం చేసి మరీ కంటెస్టెంట్స్ అంతా టాస్క్‌లోకి దిగారు. 7వ వారానికి గానీ కంటెస్టెంట్స్‌లో చలనం రాలేదు. అది కూడా బిగ్‌బాస్ చెర్నకోల తీసుకుంటే గానీ లైన్‌లోకి రాలేదు. ఇక ఇప్పటి వరకూ శ్రీ సత్య.. రేవంత్ ముందు బాగానే ఉంటూనే వెనుక గోతులు తవ్వుతూ వస్తోంది. ఊ అంటే.. ఆ అంటే రేవంత్ ఇలా చేశాడు.. అలా చేశాడంటూ జనాన్ని రెచ్చగొట్టే పనిలో పడిపోయింది. బీభత్సంగా బ్యాక్ బిచ్చింగ్ చేస్తోంది.
మొన్నటికి మొన్న రేవంత్ పప్పు అన్నాడని.. లైట్ తీసుకున్న అర్జున్‌ని ‘నీకు సిగ్గులేదా? ఎవరు ఏదన్నా పడతావా?’ అంటూ రెచ్చగొట్టి మరీ రేవంత్‌తో గొడవకు దింపింది. అసలు శ్రీ సత్య పెట్టిన ఈ చిచ్చే కెప్టెన్సీ టాస్క్ క్యాన్సిల్ కావడానికి కారణమని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక నిన్న అయితే ఏకంగా బయటపడిపోయింది. తన మనసులోని కక్ష అంతా తీర్చేసుకునే ప్రయత్నం చేసింది. అడుగడునా రేవంత్‌ను అడ్డుకుంటూ గొడవకు దిగింది. ‘తోసిపడదొబ్బు.. తీసి పడదొబ్బు అంటే ఎవడూ ఒప్పుకోడు ఇక్కడ’ అని ఫైర్ అయింది.
అంతటితో ఆగిందా? కెమెరాల దగ్గరకు వెళ్లి టాస్క్‌లో జరిగిన విషయాలను పెద్దది చేస్తానని.. ఇక ఈ వారం నామినేషన్‌లో తానేంటో రేవంత్‌కి చూపిస్తానన్నట్టుగా ప్రగల్భాలు పలికింది. ఇవి రేవంత్ వినలేదు కానీ విని ఉంటే.. ఇద్దరి మధ్య వార్ మరింత రసవత్తరంగా ఉండేది. ఇప్పటి వరకూ శ్రీసత్యపై రేవంత్ ఒక సాఫ్ట్ కార్నర్‌తోనే ఉన్నాడు. తనతో గొడవ పడుతున్నా కూడా రేవంత్ మాత్రం మనసులో ఏమీ పెట్టుకోవడం లేదు. శ్రీ సత్య గురించి ఎక్కువ తక్కువ ఎక్కడా మాట్లాడటం లేదు. ఇక నెక్ట్స్ వీక్ నామినేషన్‌లో చూడాలి వీరిద్దరి మధ్య గొడవ ఎలా ఉంటుందో..