Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు కంటెస్టెంట్స్ మామూలుగా లేరు. ఒకరిని మించిన వారు ఒకరు. ఇక శ్రీ సత్య స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని 6వ వారం వరకూ అనుకున్నాం. కానీ 7వ వారం నుంచి సీన్ మారిపోయింది. రేవంత్‌పై 6వ వారం వరకూ బ్యాక్ బిచ్చింగ్ చేసిన శ్రీ సత్య 7వ వారానికి వచ్చేసరికి ఓపెన్ అప్ అయిపోయింది.రేవంత్ పప్పు అన్నాడని అతనిపైకి అర్జున్‌ని రెచ్చగొట్టింది. దీంతో అర్జున్ రెచ్చిపోయాడు. ఇక మొన్న ఒకరోజు టాస్క్‌లో కూడా రేవంత్‌పైకి శ్రీ సత్య ఒంటికాలుపై లేచింది. కావల్సినంత నెగిటివిటీని మూటగట్టుకుంది. శ్రీ సత్య తీరును చూసి ప్రేక్షకులు కూడా అసహ్యించుకుంటున్నారు.
ఇక శుక్రవారం లాస్ట్ టాస్క్‌లో శ్రీ సత్య టీం ఓడిపోయింది. ఓడిన టీం నుంచి ఒక వరస్ట్ కంటెస్టెంట్ ఎవరో తేల్చాలని బిగ్‌బాస్ చెబితే అన్ని వేళ్లు శ్రీ సత్య వైపే చూపించాయి. కానీ అలా కాదని.. చిట్టీలు వేద్దామని మరో హైడ్రామాకు తెరదీసింది. దానిలోనూ శ్రీ సత్య పేరే వచ్చింది. చివరకు అలాగ కూడా కాదని.. తన టీం మెంబర్స్‌ని ఒప్పించి ఓటింగ్ పెట్టింది. చివరకు వాసంతిని ఇరికించింది. మొత్తానికి తాను వచ్చే వారం నేరుగా నామినేట్ కాకుండా చూసుకుంది. దీనిని అంతా బయట చూస్తున్న ప్రేక్షకులు శ్రీ సత్య ఇంత కన్నింగా అని అవాక్కయ్యారు.
శ్రీ సత్యపై పెద్ద ఎత్తున నెగిటివిటీ వచ్చింది. ఇక ఈ విషయమై నేడు హోస్ట్ నాగార్జున ప్రశ్నించారు. ముందుగా పప్పు విషయంలో తప్పు ఎవరిదని నాగ్ ప్రశ్నించారు. దీనికి ఫ్రెండ్స్ నలుగురు ఉన్నప్పుడు వారు ఏం అనుకున్నా ఓకే అని.. కానీ ఒక గేమ్ జరుగుతున్నప్పుడు అలా అనడం తప్పేనని చెప్పింది. ఇక ఆ తరువాత ఏం జరిగిందో ఏమో కానీ.. ఆ తరువాత చిట్టీల విషయం తీశారు. ‘చిట్టీల్లో నీ పేరు వచ్చింది.చిట్టీల నుంచి ఓటింగ్‌కు మార్చడం అన్నది మీరు కరెక్ట్‌గా ఫీల్ అయ్యారా?’ అని నాగ్ ప్రశ్నించారు. ‘ఇప్పటికే మేము ఎంటర్‌టైన్‌మెంట్ సరిగా చేయట్లేదని.. ఈ శనివారం మీరు పిలిచి ఫుల్లుగా తిడతారని ఫిక్స్ అయ్యాం సర్. చిట్టీల ఆట ఆడారని ఎందుకులే తిట్టించుకోవడం అని’ అని చెప్పుకొచ్చింది. మొత్తానికి నాగ్ మీద చిట్టీల వ్యవహారాన్ని తోసేసింది. నాగ్ కూడా ‘అంటే నా మీద తేశారన్నమాట’ అన్నారు.