Biggboss 6 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మూడవ వారం నామినేషన్స్ నేడు జరిగాయి. దీనికి సంబంధించిన ప్రోమో నేడు రిలీజ్ అయ్యింది. శనివారం హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరికీ నెత్తి పగిలేలా అక్షింతలు వేసిన విషయం తెలిసిందే. ఇక నుంచి మరింత కొత్తగా ఉండబోతోందని కచ్చితంగా చెప్పవచ్చు. నాగార్జున పీకిన క్లాస్‌తో మొత్తం హౌస్‌మేట్స్ అంతా ట్రాక్‌లోకి వచ్చారు.నామినేషన్స్ అంతా ఫుల్ గొడవ, కేకలు, రచ్చ రచ్చ అయ్యింది. ఈ వారం నామినేషన్స్‌లో మొత్తం 9 నుంచి 11 మంది ఉండే అవకాశం ఉంది. నామినేషన్స్ స్టార్టింగ్‌లోనే నీడలోంచి బయటకు రండి, ఎవరికీ భయపడకండి అంటూ బిగ్ బాస్ బాగానే ఎంకరేజ్‌మెంట్ ఇచ్చాడు.
ఇక బిగ్‌బాసే అంతలా ఎంకరేజ్‌మెంట్ ఇచ్చాక కంటెస్టెంట్స్ ఆగుతారా? ఒకరినొకరు నామినేట్ చేసుకుని మంటలు పుట్టించారు. అందరూ కేకలు వేసకున్నారు. కొట్టుకున్నంత పని చేశారు. ముఖ్యంగా గీతూ రాయల్- చంటి మధ్య జరిగిన గొడవ అయితే మొత్తాన్ని నివ్వెరబోయేలా చేసింది. ఈ వారం నామినేషన్స్‌లో శ్రీసత్య రెచ్చిపోయింది. ఆదివారం ఎపిసోడ్ తర్వాత శ్రీసత్యను జైల్లో పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సోమవారం సాయంత్రానికి ఆమెను బయటకు తీసుకొచ్చారు. నామినేషన్స్‌లో శ్రీ సత్య ఇనయా సూల్తానాను నామినేట్ చేసింది. అందుకు ఇనయా చాలా సీరియస్ అయ్యింది.
Biggboss 6 : కూర్చోని మాటలు చెప్పాలి.. డిస్కషన్స్ చేయాలి..
ఇద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కొట్టుకున్నంత పని చేశారు. ఇన్నాళ్లు హౌస్‌లో ఎంతో కూల్‌గా, చిల్ అవుతూ కనిపించిన శ్రీ సత్య ఈ సారి నామినేషన్స్‌లో మాత్రం ఫుల్ ఫైర్ అయ్యింది. నామినేషన్స్‌లో ఇనయాను నామినేట్ చేస్తున్న సమయంలో వారి మధ్య గట్టిగానే గొడవ జరిగింది. ఇనయాని నామినేట్ చేసిన తర్వాత ఆమె తన వర్షన్ వినిపించింది. శ్రీ సత్యకు అసలు గేమ్ ఆడాలని లేదంటూ ఆరోపించింది. కూర్చోని మాటలు చెప్పాలి.. కూర్చోని డిస్కషన్స్ చేయాలని మాత్రమే ఉందంటూ కామెంట్ చేసింది. ఇనయా చేసిన ఆరోపణలను శ్రీ సత్య ఖండించింది. ముందు నన్ను మాట్లాడనిస్తావా అంటూ కేకలు వేసింది. ఇక్కడ అసలు గేమ్ ఆడుతున్నవాళ్లు ఎవరున్నారంటూ ప్రశ్నించింది. అన్నీ సిల్లీ రీజన్స్ అంటూ ఇనయా అనగా.. అసలు నామినేషన్స్ అంటేనే సిల్లీగా ఉందిలే అన్నట్లుగా శ్రీ సత్య మాట్లాడింది.