శ్రీకాంత్ కొడుకు రోషన్ పెళ్ళిసందడి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కన్నడ భామ శ్రీలీల ఇప్పుడు తెలుగులో హాట్ అట్రాక్షన్ గా మారిపోయింది. ఈమె అందానికి, స్మైల్ కి కుర్ర హీరోలు అందరూ ఫిదా అయిపోయారు. దీంతో తమ నెక్స్ట్ సినిమాలలో శ్రీలీలని హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ రవితేజకి జోడీగా ధమాకా సినిమా చేస్తుంది. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. దీంతో పాటు. బాలయ్య సినిమాలో కూతురుగా నటిస్తుంది. దాంతో పాటు యంగ్ హీరోలైన వైష్ణవ్, శర్వానంద్, నితిన్ తో బ్యూటీ సినిమాలు కమిట్ అయింది. ఇవే కాకుండా వారాహి బ్యానర్ లో తెలుగు, కన్నడ ద్విభాష చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది.
దాంతో పాటు మరికొన్ని సినిమాలు చర్చలో దశలో ఉన్నాయి. ఇలా వరుస సినిమాలతో ఈ అమ్మడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేస్ లోకి వచ్చేస్తుంది. పూజా హెగ్డే, రష్మిక, సమంత లాంటి భామలు స్టార్ హీరోయిన్స్ కేటగిరీలో ఉన్నారు. ఇక యంగ్ హీరోలకి ఛాయస్ గా కృతి శెట్టి, శ్రీలీల, కేతిక శర్మ లాంటి హీరోయిన్స్ ఉన్నారు. అయితే కృతి శెట్టికి సక్సెస్ పడటం లేదు. ఇక కేతిక శర్మకి కూడా ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలు ఫ్లాప్ జాబితాలో చేరాయి.
ఈ నేపధ్యంలో శ్రీలీలని ఎక్కువ మంది ఛాయస్ గా ఎంచుకుంటున్నారు. ఈ అమ్మడి అందానికి కుర్ర హీరోలు బాగా కనెక్ట్ కావడంతోనే ఆమెని హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారనే మాట వినిపిస్తుంది. అయితే శ్రీలీల రెమ్యునరేషన్ కాకుండా ఎక్స్ ట్రా ఖర్చులతో నిర్మాతలని భయపెడుతుందనే మాట వినిపిస్తుంది. ఈ కారణంగానే రీసెంట్ గా డీజే టిల్లు సీక్వెల్ నుంచి శ్రీలీల తప్పుకుందనే టాక్ వినిపిస్తుంది.