టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న అందాల భామ శ్రీలీల. రెండో సినిమా రిలీజ్ కాకుండానే ఏకంగా ఏడు సినిమాలని ఆమె లైన్ లో పెట్టింది. ఇక తాజాగా ధమాకా మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇక తాజాగా నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయబోయే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మరో వైపు, తెలుగు, తమిళ్ భాషలలో అరడజను సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ప్రస్తుతం సెకండ్ షెడ్యుల్ జరగాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఫస్ట్ షెడ్యుల్ తర్వాత మహేష్ బాబు తల్లి చనిపోవడం తరువాత పూజా హెగ్డే కాళ్ళు ఫ్యాక్చర్ కారణంగా రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ కృష్ణ మృతి చెందడం వంటి వరుస విషాద ఘటనల కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. త్వరలో మహేష్ బాబు ఈ మూవీ షూటింగ్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.
దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మూవీలో పూజా హెగ్డేతో పాటు మరో ముగ్గురు హీరోయిన్స్ కి ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ముగ్గురు హీరోయిన్స్ ని ఎంపిక చేసినట్లు టాక్. వారిలో శ్రీలీలకి మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికిందనే మాట వినిపిస్తుంది. మిగిలిన వారు కూడా యంగ్ టాలెంటెడ్ హీరోయిన్స్ ని ఫైనల్ చేసినట్లు బోగట్టా. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ఇప్పుడు అంతగా ఆసక్తి నెలకొని ఉంది.