పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ శ్రీలీల. మొదటి సినిమా ఫ్లాప్ అయిన ఊహించని విధంగా ఈ అమ్మడు తెలుగులో వరుస అవకాశాలని అందుకుంటుంది. ప్రస్తుతం రవితేజకి జోడీగా ధమాకా సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది. మరో వైపు బాలకృష్ణ కూతురుగా ఓ సినిమాలో నటిస్తుంది. అలాగే రామ్ పోతినేనికి జోడీగా బోయపాటి శ్రీను సినిమాలో ఈ భామనే హీరోయిన్. నితిన్ కి జోడీగా ఒక సినిమాలో నటిస్తుంది. ఇలా వరుసగా యంగ్ హీరోల సరసన అవకాశాలని ఈ అమ్మడు అందుకుంటుంది. రెండో సినిమా రిలీజ్ కాకుండానే శ్రీలీల చేతిలో ఏకంగా 8 చిత్రాల వరకు ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీకి ఉన్న డిమాండ్ నేపధ్యంలో యంగ్ హీరోలు అందరూ కూడా తనతో జతకట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఇప్పటి వరకు 20 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. అయితే డిమాండ్ పెరగడంతో శ్రీలీల ఒకేసారి తన రెమ్యునరేషన్ ని కోటి రూపాయిలకి పెంచేసినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు అంగీకరించిన సినిమాలు కాకుండా కొత్త నిర్మాతలు వస్తే కోటి రూపాయిల రెమ్యునరేషన్ ఇస్తేనే చేస్తానని కరాఖండీగా చెబుతున్నట్లు తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో అంత పెద్ద మొత్తం ఇచ్చుకోలేక నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నట్లు టాక్. అయితే ఈ ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయడానికి ఈ బ్యూటీకి కనీసం రెండేళ్లు అయిన పట్టే అవకాశం ఉంది. ఈ కారణంగానే శ్రీలీల ఇలా రెమ్యునరేషన్ పెంచిందని టాక్ వినిపిస్తుంది. ఈ ఎనిమిది సినిమాలు రిలీజ్ అయిన తర్వాత రెమ్యునరేషన్ ఎలాగూ పెరుగుతుంది కాబట్టి ఈ లోపే చిన్న చిన్న సినిమాలని అవాయిడ్ చేయడానికి శ్రీలీల ఈ స్ట్రాటజీ వాడుతుందని టాక్.