Sree Leela: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించారు మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ ను తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకుంది.
తన అందం,నటనతో ఎంతోమంది ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్రను వేసుకుంది. కాగా ప్రస్తుతం శ్రీ లీల వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అర డజను కు పైగా సినిమాలు ఉన్నాయట.
ప్రస్తుతం శ్రీ లీల రవితేజ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అదేవిధంగా బాలకృష్ణ,మహేష్ బాబు, శర్వానంద్,నితిన్ సినిమాలలో కూడా నటింస్తోంది.
ఇక ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లు చేస్తూ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ ఉంటుంది.
ఇక తన మత్తెక్కించే అందాలతో యూత్ ని తన వైపుకు తిప్పుకుంటోందీ. గా ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ లీల తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలో శ్రీ లీల వైట్ కలర్ డ్రెస్ ధరించి ఎంతో అందంగా ముస్తాబు అయ్యింది.
ఆ ఫోటోలను చూసిన అభిమానులు ఆ ఫోటోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.