Sowmya Rao: తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన కామెడీ షో ఈటీవీలో వచ్చే జబర్దస్త్. తెలుగు వాళ్లకు కామెడీని మరో యాంగిల్ లో చూపించిన టీవీ షోగా దీనికి మంచి పేరు ఉండగా.. ఆ మధ్యన కొందరు టాప్ కమెడియన్లు దీనికి దూరమయ్యారు. టాప్ కమెడియన్లు జబర్దస్త్ కు దూరం కావడంతో ఆ మధ్యన రేటింగ్ కాస్త తగ్గినట్లు కనిపించింది.
తాజాగా పాత కమెడియన్లు అందరూ తిరిగి
comedian
వచ్చేయడంతో పాటు కొత్త యాంకర్ సౌమ్యారావు ఎంట్రీతో మంచి కిక్కు వచ్చింది. సౌమ్యారావు తన అందంతో పాటు కామెడీ పంచులతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ లాంటి వాళ్లను సైతం అమ్మడు బాగా ఆడుకుంటోంది.
కాగా తాజాగా సౌమ్యారావుకు సంబంధించిన ఓ విషయం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. సౌమ్యారావు జబర్దస్త్ యాంకర్ గా వచ్చి కనీసం నెల కూడా కాకముందే.. అమ్మడు తన ట్యాలెంట్ ను చూపిస్తోందట. ఓ ఎపిసోడ్ లో తన గతం గురించి చెప్పి అందరినీ ఏడిపించిన సౌమ్యారావును.. ఓ కమెడియన్ ఓదార్చాడట.
Sowmya Rao:
జబర్దస్త్ లో మంచి పేరున్న సదరు కమెడియన్ యాంకర్ సౌమ్యారావును గోకుతున్నాడట. కమెడియన్ కు బాగానే వర్కవుట్ అయిందని, ఇప్పుడు ఇద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకొని చాటింగ్ కూడా చేసుకుంటున్నారని తెలుస్తోంది. జబర్దస్త్ షూటింగ్ ముగిసిన తర్వాత ఇద్దరు కలిసి సదరు కమెడియన్ కారులోనే వెళ్లిపోతున్నారనే విషయం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.