Sonam Kapoor : బాలీవుడ్ ఒరిజినల్ ఫ్యాషన్ క్వీన్ సోనమ్ కపూర్ మరోసారి తన ఫ్యాషనబుల్ లుక్స్‌తో రెచ్చిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. నటి సోనమ్ కపూర్ ముంబైలోని విమానాశ్రయంలో భర్త ఆనంద్ అహూజా, తన మూడు నెలల కొడుకుతో కలిసి సందడి చేసింది. ఈ చిన్నది డిజైనర్ అవుట్‌ఫిట్‌ను వేసుకుని శీతాకాలపు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తోంది. ఈ అవుట్‌ఫిట్‌లో క్రేజీ గా సోనమ్ కనిపించడంతో ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాకు పని చెప్పారు. వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Sonam Kapoor : అకేషన్‌కు తగ్గట్లుగా అవుట్‌ఫిట్ వేసుకుని ఇంప్రెస్ చేయాలంటే సోనమ్ కపూర్ తరువాతే ఎవరైనా. పెళ్లికి ముందు ఈ బ్యూటీ ఫ్యాషన్ తో చేసిన గేమ్స్ ఇప్పటికీ అభిమానులు మరిచిపోరూ. పెళ్లై, పిల్లాడు పుట్టినా అతే పంథాను ఇప్పటికీ కొనసాగిస్తోంది ఈ పొడవు కాళ్ల సుందరి. ఎత్నిక్ వేర్ అయినా మోడ్రన్ డ్రెస్సులైనా, ఫంక్షన్‌లైనా, పార్టీలైనా ప్రతి అకేషన్‌కు సరిపడా ఫ్యాషనబుల్ అవుట్‌ఫిట్స్ సోనమ్ వార్డ్‌రోబ్‌లో దర్శనమిస్తాయి. ఫ్యాషన్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటాయి.

తాజాగా ఈ చిన్నది తన ఎయిర్ పోర్ట్ లుక్ కోసం మింట్ గ్రీన్ డ్రెస్ వేసుకుని కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేసింది. దానిపైకి బ్లాక్ బ్లేజర్ ధరించి వింటర్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్‌ను అందించింది. ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా టాడ్స్ నుండి సేకరించిన గూచీ బ్యాగ్ ను భుజాలకు వేసుకుని పాదాలకు నల్లటి బూట్‌లను దొడుక్కుంది.

ఈ లుక్‌లో సోనమ్ కపూర్ ఫ్యాషన్ దివాలా కనిపిస్తోంది. సోనమ్ పిక్స్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన రియా, కమ్ త్రూ అని క్యాప్షన్‌ను జోడించింది. ఇక కూతురి ఫ్యాషన్ స్టైల్స్ చూసిన తండ్రి అనిల్ కపూర్ తన కుమార్తె పోస్ట్‌కు ఫైర్ ఎమోజీలతో రిప్లై ఇచ్చారు. సోనమ్ అభిమానులు కూడా ఇన్‌బాక్స్‌లో ఆమెను ప్రశంసించారు, హార్ట్ ఎమోజీలతో ఇన్‌బాక్స్‌ను ముంచెత్తారు.
