Sonam Kapoor : బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ , ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజా తమ గారాల సుపుత్రుడికి నామకరణం చేశారు. ఈ రోజు తమ కుమారుడి మొదటి నెల పుట్టినరోజు సందర్భంగా దంపతులు వాయు కపూర్ ఆహుజా అని పేరు పెట్టారు. ఈ కపుల్స్ మొదటి సారిగా వాయుకపూర్ మొదటి చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా ఫాలోవర్స్‌తో, ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. కుమారుడు పేరు వెనక ఉన్న అర్థాన్ని వివరించారు. ఈ అకేషన్‌ను పురస్కరించుకుని సోనమ్ కపూర్, భర్త ఆహుజాతో పాటు కుమారుడు పసుపు రంగు సాంప్రదాయ దుస్తుల్లో సూర్యుని కిరణాల్లా మెరిసిపోయారు.
ఆనంద్ తన కుమారుడుని తన చెతులతో పట్టుకుని సోనమ్ నుదిటిపై ముద్దు పెట్టుకుంటున్న పిక్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ పిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. క్యూట్ వాయువుని చూసి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు ఫాలోవర్స్ విషెస్ చెబుతున్నారు. హార్ట్ ఏమోజీలను పోస్ట్ చేస్తున్నారు.

Sonam Kapoor : మలైకా అరోరా, దిశా పఠానీ, అనీల్ కపూర్, రియా కపూర్, అనైత ష్రాఫ్ అదజానీ, అర్జున్ కపూర్ ఇలా చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు న్యూ పేరెంట్స్‌కు కామెంట్ సెక్షన్‌లో విషెస్ తెలిపారు. వాయు కపూర్ పేరు ఎంతో అందమైన పేరని, దేవుని ఆశిస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయని మలైకా కామెంట్ చేసింది.

బాలీవుడ్‌లో బోలెడంత ఫ్యూచర్ ఉన్నప్పటికీ మనసుకు నచ్చిన ప్రియుడిని పెళ్లాడి సినిమాలకు దూరమైంది సోనమ్ కపూర్. సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన పర్సనల్ విషయాలను ఫ్యాషన్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా ఫాలోవర్స్‌తో పంచుకుంటుంది సోనమ్ కపూర్. ఫ్యాషన్ స్టైల్ స్టేట్‌మెంట్స్ ఇవ్వడంలో ఈ భామను మించిన వారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదేమో. విభిన్న శైలిలో డిజైన్ చేసిన వస్త్రాలను ధరించి ఫ్యాషన్ ఐకాన్‌గా పేరు సంపాదించుకుంది. అందుకే అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంటుంది. ప్రెగ్నెంట్ సమయంలోనూ సోనమ్ కపూర్ మెటర్నిటీ ఫోటో షూట్‌లతో సోషల్ మీడియాను షేక్ చేసేసింది. కాబోయే తల్లులకు ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ భామ సుపుత్రానంధంలో మునిగిపోయింది. కొడుకు ఆలన పాలనతో విలువైన సమయాన్ని గడుపుతోంది.
