Sonam Kapoor : సోనమ్ కపూర్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. తనదైన స్టైలిష్ లుక్స్‌తో ఫ్యాన్స్‌కు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తోంది. ముంబైలో జరిగిన ఓ పార్టీ కోసం ఈ చిన్నది అదిరిపోయే అవుట్‌ఫిట్‌ను వేసుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. బోహో స్టైల్ అవుట్‌ఫిట్ తో అందరి మైండ్ బ్లాక్ చేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనామికా ఖన్నా డిజైన్ చేసిన రీగల్ బ్లాక్ కఫ్తాన్ ధరించి పార్టీలో సందడి చేసింది. బ్లాక్ డ్రాప్‌లో మల్టీకలర్డ్ ప్యాట్రన్స్‌తో , క్లిస్టమైన ప్యాచ్‌వర్క్‌తో వచ్చిన ఈ అవుట్‌ఫిట్‌లో సోనమ్ అదిరిపోయింది.

Sonam Kapoor : ఈ బోహో లుక్ అవుట్‌ఫిట్‌తో పార్టీలో సందడి చేయడమే కాదు ఖతర్నాక్ ఫోటో షూట్ చేసి యూత్‌ను తన లుక్స్ తో కట్టిపడేసింది సోనమ్ కపూర్. అదిరిపోయే కఫ్తాన్‌తో హాట్ పోజులు ఇచ్చి తనలోని స్టైలిష్ లుక్స్‌ను మరోసారి అభిమానులకు పరిచయం చేసింది. ఈ పార్టీ వేర్‌తో చేసిన ఫోటో షూట్ పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేసింది సోనమ్ కపూర్. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఈ బ్లాక్ అవుట్‌ఫిట్‌కు మ్యాచింగ్‌గా స్టైలిష్ ఆభరణాలను ఎన్నుకుంది సోనమ్. నుదుటన పాపిటబిల్ల , చెవులకు అందమైన ఇయర్‌రింగ్స్ పెట్టుకుని తన అందాలతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. స్టైలిస్ట్ రియా కపూర్ సోనమ్ కపూర్‌కు స్టైలిష్ లుక్స్‌ను అందించగా, మేకప్ ఆర్టిస్ట్ మల్లికా సోనమ్ అందాలకు మెరుగులు దిద్దింది.

రీసెంట్‌గా భర్తతో కలిసి ఓ అందమైన ఫోటో షూట్ చేసింది సోనమ్ కపూర్ . వైట్ అండ్ వైట్ అవుట్‌ఫిట్ లో ఈ కూల్ కపుల్ ఎంతో మెస్మరైజింగ్‌గా కనిపించారు. ఫ్లోరల్ ఎంబ్రాయిడరీతో విభిన్న శైలిలో డిజైన్ చేసిన ఫ్రాక్‌ను సోనమ్ వేసుకోగా, ఆనంద్ ఆహుజా వైట్ కలర్ కుర్తా పైజామా వేసుకున్నాడు. ఈ క్యూట్ కపుల్ కెమెరాకు క్రేజీ లుక్స్ ఇచ్చి ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు.

అంతకు ముందు సోనమ్ కపూర్ ప్రీ దీపావళి కోసం, రీ-సెరిమోనియల్ షెల్ఫ్ నుంచి చేతితో ఎంబ్రాయిడరీ చేసిన ఘాగ్రా చోలీ సెట్‌ను ధరించి అదరగొట్టింది. ఈ అవుట్‌ఫిట్ మొత్తం దాదాపు 50 పూల రేకలను అందంగా ఎకో ప్రింట్స్‌తో ఎంబ్రాయిడరీ చేశారు డిజైనర్లు .

ఈ ఘాగ్రాకు సరిపోయేలా గులాబీ రంగు జరీ వచ్చిన దుపట్టాను వేసుకుంది సోనమ్. చెవులకు భారీ ఇయర్ రింగ్స్, కాళ్లకు గజ్జెలు చేతి వేళ్లకు ఉంగరాలు పెట్టుకుని ఎత్నిక్ లుక్స్‌తో అదరగొట్టింది. కనులకు స్మోకీ ఐ ష్యాడో, ఐ లైనర్, మస్కరా దిద్దుకుని పెదాలకు న్యూడ్ లిప్ షేడ్ పెట్టుకుని ఎత్నిక్ లుక్స్‌తో అందరిని మెస్మరైజ్ చేసింది సోనమ్. సోనమ్ తో పాటు భర్త ఆనంద ఆహుజా బ్రౌన్, వైట్ కలర్ కాంబినేషన్‌లో వచ్చిన కుర్తా సెట్‌ను వేసుకుని కెమెరాకు ఫోజులు ఇచ్చాడు.

బాలీవుడ్‌లో పెళ్లైన ప్రతి జంట కర్వా చౌత్‌ను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కానీ ఆనంద్ ఆహుజా, సోనమ్ కపూర్‌లు ఈ ట్రెడిషన్‌ను పెద్దగా ఫాలో అవ్వరు. అయినప్పటికీ అకేషన్ కోసం సోనమ్ కపూర్ కలర్‌ఫుల్ అవుట్‌ఫిట్ వేసుకుని అందరిని ఫిదా చేసింది. ఈ బ్యూటీ డిజైనర్ గురంగ్ షా రూపొందించిన టస్సర్ కంఠా ఎంబ్రాయిడరీ లెహంగాను వేసుకుని ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది. కాంజీవరమ్ బార్డర్, ఆర్గాంజ దుపట్టా లో ఎత్నిక్ లుక్స్ ఇస్తూ ఫెస్టివ్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేసింది ఈ చిన్నది. రెడ్, గ్రీన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ అవుట్‌ఫిట్‌లో ఎంతో హాట్ గా కనిపించింది సోనమ్.
