Sonam Kapoor : సోనమ్ కపూర్ సంపూర్ణ ఫ్యాషన్‌వాది. ఈ నటి తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌కి ఫిదా కానీ వారంటూ ఎవరూ ఉండరు. సోనమ్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లను తరచుగా పంచుకుంటూ ఉంటుంది . వాటిలో ప్రతి ఒక్కటి ఫ్యాషన్ ప్రేమికులను ప్రత్యెగంగా ఆకట్టుకుంటాయి . పసుపు రంగు అనార్కలీ సెట్‌లలో సంప్రదాయ వస్త్రధారణ నుండి, కఫ్తాన్ స్వెటర్ డ్రెస్‌లో వింటర్ సీజన్‌లో ఎలా చక్కగా అలంకరించుకోవాలో ఈ భామకు బాగా తెలుసు.

ఈ బ్యూటీ తాజాగా అద్భుతమైన బ్లాక్ అవుట్ ఫిట్ తో ఢిల్లీలోని విక్టోరియా సీక్రెట్ స్టోర్ ప్రివ్యూకి హాజరై అందరి దృష్టిని ఆకర్షించింది. సోనమ్ ఈ ఈవెంట్ కోసం బ్లాక్ శాటిన్ డ్రెస్ ను ఎన్నుకుంది. కార్సెట్ వివరాలు, స్వీట్ హార్ట్ నెక్‌లైన్ తో వచ్చిన ఈ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపించింది. డ్రెస్ కు వచ్చిన డ్రమాటిక్ ఫుల్ స్లీవ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సోనమ్ బ్లాక్ బ్యాక్‌డ్రాప్‌తో ఎప్పటిలాగే అద్భుతంగా కనిపించింది.

ఈ చిత్రాలతో పాటు, ఢిల్లీలో తనకు ఆతిథ్యమిచ్చిన బ్రాండ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ టోకెన్ కూడా రాసింది “హలో విక్టోరియా సీక్రెట్ సిబ్బంది! మీకు ఇష్టమైన ఆంబియన్స్ మాల్, వసంత్ కుంజ్ వద్ద ఢిల్లీ 1వ స్టోర్ ప్రివ్యూ వద్ద నన్ను ఉంచినందుకు ధన్యవాదాలు అని తెలిపింది.

ఈ వేషధారణలో సోనమ్ ఫోటోలకు హాట్ పోజులిచ్చి అద్భుతంగా కనిపించింది. పాదాలకు బ్లాక్ హీల్స్, చెవులకు డైమండ్ ఇయర్ స్టడ్‌లను పెట్టుకుని మెరిసిపోయింది. తన కురులను సైడ్ పాపిట తీసి లూస్ గా వదులుకుంది ఈ చిన్నది. మినిమల్ మేకప్ లుక్‌ని ఎంచుకుని ఫ్యాన్స్ ను మెస్మెరైజ్ చేసింది. కనులకు గోల్డెన్ ఐషాడో, బ్లాక్ వింగేడ్
ఐలైనర్, మాస్కరాతో నిండిన కనురెప్పలు, అందంగా గీసిన కనుబొమ్మలతో పేదలకు న్యూడ్ లిప్‌స్టిక్ దిద్దుకుని తన అభిమానులను ఉర్రూతలూగించింది.
