Sonali Bendre : సోనాలి బింద్రే అద్భుతమైన ఫ్యాషన్‌వాది, నిజమైన స్టైల్ ఐకాన్. ప్యాంట్ సూట్ లో బాస్ లేడీ వైబ్స్ తీసుకురావాలన్నా, ఎత్నిక్ దుస్తులతో ఫెస్టివల్ లుక్స్‌లో మెరవాలన్నా సోనాలికి వెన్నతో పెట్టిన విద్య. ఒకసారి ఫాలో అయిన స్టైల్‌ను మరోసారి రిపీట్ చేయదు ఈ భామ. ఆమె ధరించే ప్రతి దుస్తులకు పర్సనల్ టచ్‌ను అందిస్తుంది. ఆ స్టైలిష్ లుక్సే ఫ్యాషన్ ప్రియుల మనసు గెలిచేలా చేశాయి.

Sonali Bendre : ప్రస్తుతం సోనాలీ బింద్రే సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటోంది. ఆమె పర్సనల్ విషయాలను ఫోటో షూట్ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. తాజాగా తెలుపు రంగు దుస్తులను ధరించి చేసిన ఫోటో షూట్ పిక్స్‌ను నెట్టింట్లో షేర్ చేసింది. ఈ పిక్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

సోనాలి బింద్రే 47 ఏళ్ల వయసులోనూ ఎంతో నాజూకుగా కుర్ర హీరోయిన్‌లు సైతం కుళ్లుకునేలా కనిపిస్తోంది. ఈ బ్యూటీ వైట్ కలర్ ప్లంగింగ్ నెక్‌లైన్‌తో వచ్చిన స్ట్రాప్ వైట్ కలర్ అవుట్‌ఫిట్‌ను వేసుకుని సోఫాలో కూర్చుని కుర్రాళ్లను కవ్వించింది. ఈ గౌను మీదగా ఫుల్ స్లీవ్స్ తో వచ్చిన జాకెట్‌ను వేసుకుంది. ఈ అవుట్‌ఫిట్‌లో కాస్త గ్లామర్ డోస్‌ను పెంచి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది సోనాలి. ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా మినిమల్ మేకప్‌తో , సింపుల్ జ్యువెల్లరీ వేసుకుని ఫ్యాన్స్ మనసు దోచేస్తోంది.

బ్రోకెన్ న్యూస్ వెబ్ సీరీస్ ప్రమోషన్‌లో భాగంగా తన వార్డ్ రోబ్ నుంచి అద్భుతమైన అవుట్‌ఫిట్స్‌ను ధరించి ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేసింది సోనాలి. క్లాతింగ్ బ్రాండ్ 431-88 నుంచి సేకరించిన ప్లంగింగ్ నెక్‌లైన్ తో వచ్చిన వెల్వెట్ డ్రెస్‌ను వేసుకుని అదరగొట్టింది.

అంతకు ముందు సోనాలి మోనోక్రొమాటిక్ లుక్స్‌తో మైండ్ బ్లాక్ చేసింది. ముదురు ఆకుపచ్చ రంగులో వచ్చిన ఫుల్ స్లీవ్స్ బటన్ డౌన్ షర్ట్ దానికి జోడీగా సాటిన్ ప్యాంట్ వేసుకుని అదరగొట్టింది. పాదాలకు న్యూడ్ హీల్స్, చెవులకు స్టేట్‌మెంట్ ఇయర్‌రింగ్స్ పెట్టుకుని మెస్సీ పోనీటెయిల్‌తో మెస్మరైజింగ్ లుక్స్‌తో అందరిని ఆకట్టుకుంది.

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి తనదైన నటనతో గ్లామర్‌తో వెండితెరను ఏలింది సోనాలీ. హీరోయిన్‌గా ఆమె నటనకు గాను ఫిల్మ్‌ఫేర్ అవార్డు నుంచి ఎన్నో అవార్డులను అందుకుంది. మోడల్ గా తన కెరీర్‌ను ప్రారంభించిన సోనాలి 90 దశకంలో సినీ ఇండస్ట్రీలో లీడింగ్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. మురారీ, ఇంద్రా, ఖడ్గం, మన్మథుడు, శంకర్‌దాదా ఎంబిబిఎస్ వంటి హిట్ చిత్రాల్లో అగ్రహీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనసును గెలిచింది.

2004 సినీ ఇండస్ట్రీని వీడి ఫ్యామిలీ లైఫ్‌లో బిజీ అయ్యింది. అయితే అనుకోకుండా ఆమె లైఫ్‌ను క్యాన్సర్ హమమ్మారి చెల్లాచెదురు చేసింది. అయినా పట్టుదలతో ఆ మహమ్మారి జయించి మళ్లీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తోంది సోనాలి. ప్రస్తుతం టీవీల్లో ప్రసారమయ్యే షోలల్లో పాల్గొంటూ వెబ్ సీరీస్‌లలో నటిస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.
