Sonal Chauhan : సోనాల్ చౌహాన్ ఎత్నిక్ లుక్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫెస్టివ్ ఫ్యాషన్‌ను ప్రమోట్ చేస్తోంది. వైట్ కలర్ లెహెంగా వేసుకుని తన అందాల ప్రదర్శనతో అందరిని మంత్రముగ్ధులను చేస్తోంది. తాజాగా చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తున్నాయి. అమ్మడి అందాలను పొగడ్తలతో ముంచేస్తున్నారు అభిమానులు.

Sonal Chauhan : నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సోనాల్ చౌహాన్. బాలయ్యతో రొమాన్స్ చేసిన ఈ మూవీ హిట్ కొట్టడంతో అమ్మడికి మంచి అవకాశాలు వస్తాయని అందరూ భావించారు .కానీ ,చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి ఈ భామ చెంతకు చేరలేదు. ఆ మధ్యన అనుష్క హీరోయిన్ గా నటించిన సైజ్ జీరోలో సోనాల్ తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. బాలీవుడ్‌లోనూ ఈ భామ పరిస్థితి ఇలాగే ఉంది. చాలా గ్యాప్ తరువాత నాగార్జునతో కలిసి ఘోస్ట్ సినిమాలో నటించి తన హాట్ అందాలతో పిచ్చెక్కించింది ఈ బ్యూటీ. సినిమా అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండటంతో సోనాల్ సోషల్ మీడియా బాట పట్టింది. అకేషన్‌కు తగ్గట్లుగా గ్లామరస్ ఫోటో షూట్‌లు చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకోవడంతో పాటు ఫిల్మ్ మేకర్స్‌ను అట్రాక్ట్ చేసేందుకు వీర లెవెల్ లో ప్రయత్నిస్తోంది.

తాజాగా సోనాల్ చౌహాన్ వైట్ కలర్ లెహంగా వేసుకుని చేసిన ఫోటో షూట్‌లో క్లీవేజ్ షోతో కుర్రాళ్ల మతులు పొగొట్టేస్తోంది. చమీ అండ్ పలక్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకున్న ఈ అవుట్‌ఫిట్‌లో ఎంతో సెక్సీగా దర్శనమిచ్చింది సోనాల్. వైట్ బ్యాగ్రౌండ్‌లో విభిన్న రంగుల షేడ్స్‌లో ఫ్లోరల్ ప్రింట్స్‌తో డిజైన్ చేసిన ఈ లెహెంగా లో సోనాల్ తారలా మెరిసిపోయింది. లెహెంగాకు మ్యాచింగ్ ఫ్లోరల్ ప్రింట్స్‌తో వచ్చిన ప్లంగింగ్ నెక్‌లైన్ కలిగిన స్లీవ్‌లెస్ బ్రాలెట్‌ను వేసుకునింది.

ఈ లెహెంగా చోలీకి మ్యాచ్ అయ్యేలా నెట్టెడ్ దుపట్టాను భుజాల మీదుగా వేసుకుని స్టన్నింగ్ లుక్స్‌తో అదరగొట్టింది ఈ భామ. అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా మెడలో ముత్యాలతో డిజైన్ చేసిన చోకర్ నెక్‌లెస్ , చెవులకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. ఈ జ్యువెల్లరీని మిరాకీ జ్యువెల్లరీ నుంచి సేకరించగా స్టైలిస్ట్ దేవరాజ్ సోనాల్ కు స్టైలిష్ లుక్స్‌ను అందించాడు.

ఇటీవల చేసిన ఓ ట్రెడిషనల్ ఫోటో షూట్ కోసం మహిమా మహాజన్ ఫ్యాషన్ లేబుల్ నుంచి అందమైన పసుపు రంగు లెహెంగా సెట్‌ను ధరించి కుందనపు బొమ్మలా మెరిసిపోయింది సోనాల్. విభిన్న రంగుల షేడ్స్‌లో ఫ్లోరల్ ప్రింట్స్‌తో డిజైన్ చేసిన ఈ లెహెంగాలో ఎంతో హాట్ గా కనిపించింది సోనాల్. హౌజ్ ఆఫ్ శిఖా నుంచి ఎన్నుకున్న చోకర్ నెక్‌లెస్ ఫోటో షూట్‌లో హైలెట్‌గా నిలిచింది. హెయిర్ స్టైలిస్ట్ షెఫాలీ స్టైలిష్ హెయిర్‌ను అందించగా మేకప్ ఆర్టిస్ట్ ఆషూ గుప్తా సోనాల్ అందానికి మెరుగులు దిద్దింది.

అంతకు ముందు బాత్ టబ్‌లోనూ హాట్ ఫోటో షూట్ చేసింది సోనాల్. డార్క్ పింక్ కలర్ సాటిన్ కో-ఆర్డ్ సెట్ వేసుకుని కుర్రాళ్లకు చెమటలు పట్టించింది. ఫ్రంట్‌లో వచ్చిన కటౌట్ డీటైల్స్ అవుట్‌ఫిట్‌కు అమేజింగ్ లుక్స్‌ను అందించాయి. ఇలా హాట్ ఫోటోలు ఇస్తూ సోనమ్ అందాల దాడి చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.
