Sonakshi Sinha : ఫ్యాషన్ తో ప్రయోగాలు చేయడం అంటే బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాకు బాగా ఇష్టం. వైబ్రoట్ కలర్స్ తో డిఫరెంట్ స్టైల్స్ తో దుస్తులు ధరించి అందరి చూపులు తన వైపుకు తిప్పుకోవడంలో ఈ బొద్దుగుమ్మ ఆరితేరిపోయింది. ఫ్రెష్ గా వైట్ కలర్ అవుట్ ఫిట్ వేసుకొని మెస్మరైజింగ్ లుక్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

Sonakshi Sinha : సోనాక్షి కాస్త గ్యాప్ తర్వాత డబుల్ ఎక్సెల్ సినిమాతో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమైంది. హుమా ఖురేషి జహీర్ ఇక్బాల్ ఈ మూవీలో నటిస్తున్నారు. ఈ మధ్యనే మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఫిలిం మేకర్ సత్రం రమాని బాడీ షేమింగ్ అనే కాన్సెప్ట్ తో మూవీని తెరకెక్కిస్తున్నాడు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో మూవీపై అంచనాలు పెరిగాయి.

నవంబర్ 4వ తారీఖున ఈ మూవీని థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ప్రమోషన్ల పనిలో పడిపోయారు నటీమణులు. సోనాక్షి సిన్హా అయితే అదిరిపోయే అవుట్ ఫిట్స్ ను ధరించి గ్లామర్ షోతో హీట్ పెంచుతుంది.

తాజాగా వైట్ కలర్ టాప్, షార్ట్ వేసుకుని థైస్ అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది సోనాక్షి సిన్హా. కెమెరాకు విభిన్న హాట్ భంగిమల్లో ఫోజులు ఇచ్చి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. హాఫ్ స్లీవ్స్, కాలర్ నెక్ తో వచ్చిన లూస్ షర్ట్ వేసుకొని దానికి జోడిగా అదే రంగులో వచ్చిన ట్రెండీ షాట్ ను ధరించింది. నడుముకు పెట్టుకున్న బ్లాక్ బెల్ట్ అవుట్ ఫిట్ ని అట్రాక్టివ్ గా మార్చింది. పాదాలకు బ్లాక్ కలర్ బూట్స్ వేసుకుని అదరగొట్టింది.

సోనాక్షికి నెయిల్ ఆర్ట్ అంటే చాలా ఇష్టం. ఈ అవుట్ ఫిట్ కు క్రేజీ లుక్ తీసుకొచ్చేందుకు స్టన్నింగ్ నెయిల్ ఆర్ట్ చేయించుకుంది. తన రెండు చేతుల్లో ఉన్న వేళ్ళకు వైట్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకుని రింగ్ ఫింగర్ కు స్టోన్స్ తో డెకరేషన్ చేసింది.

ఇక వేళ్ళకు స్టైలిష్ ఉంగరాలను పెట్టుకుంది. తన నెయిల్ ఆర్ట్ స్పష్టంగా కనిపించేలా ఈ బ్యూటీ ఓ ఫోటో దిగి దాన్ని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ కూడా వైరల్ అవుతుంది.
