Sonakshi Sinha : వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ మల్టీ టాలెంట్ తో తనదైన స్టైల్ లో పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా. తన పర్సనాలిటీని ప్లస్ పాయింట్ గా మార్చుకుంటూ సినిమాల్లో ఎక్స్ పరిమెంట్స్ కు పెద్దపీట వేస్తుంది ఈ బ్యూటీ. లేటెస్ట్ గా డబుల్ ఎక్స్ ఎల్ అనే మూవీతో డబుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అయింది ఈ ముద్దుగుమ్మ. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ పనిలో మునిగి తేలుతోంది సోనాక్షి. తాజాగా ఫ్యాషన్ తో ప్రమోషన్స్ చేస్తూ కుర్రాలలో హిట్ పెంచుతోంది ఈ బొద్దుగుమ్మ.

Sonakshi Sinha : డబుల్ ఎక్స్ ఎల్ మూవీ కి సంబంధించి మొదటి రోజు ప్రమోషన్ లో భాగంగా ఈ దబంగ్ నటి మల్టీ కలర్ తో వచ్చిన ప్రింటెడ్ కో ఆర్డ్ సెట్ ను ధరించి అదరగొట్టింది. ఫ్యాషనబుల్ స్కర్ట్ సెట్ తో యూత్ ను ఫిదా చేసేసింది. క్రాప్డ్ బ్లేజర్, టై అప్ స్కర్ట్ తో ఈ అవుట్ ఫిట్ ను డిజైన్ చేశారు డిజైనర్లు. చూడటానికి ఈ అవుట్ ఫిట్ లుంగీలా కనిపిస్తోంది.ఈ అవుట్ ఫీట్ ను డిజైనర్ అనామిక ఖన్నా కలెక్షన్స్ నుంచి సేకరించింది సోనాక్షి. ఈ దుస్తుల్లో మిస్టర్ స్టైల్ లో మెరిసింది ముద్దుగుమ్మ.

ఈ డ్రెస్ కు తగ్గట్లుగా పాదాలకు క్లియర్ స్ట్రాప్ హీల్స్ వేసుకుంది. బోహో స్టైల్ జ్యువల్లరీ ని సెలెక్ట్ చేసుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ పిక్స్ కు ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ పోస్ట్ చేశారు. సోనాక్షి అందాలను పొగడ్తలతో ముంచేశారు.

1987లో ముంబైలో పుట్టిన 35 ఏళ్ల సోనాక్షి సీనియర్ యాక్టర్ శత్రుజ్ఞ సీన్హా పూనమ్ ల గారాల పట్టి. ఫ్యాషన్ డిజైనింగ్ లో గ్రాడ్యుయేషన్ చేసింది. చాలా సినిమాల్లో ఫ్యాషన్ డిజైనర్ గా పని చేసింది. 2010లో సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ సినిమాలో నటించి మెప్పించింది.

ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో స్టార్ హీరోల సరసన మెరిసి తన నటనతో మెస్మరైజ్ చేసింది. లేటెస్ట్ గా డబుల్ ఎక్స్ ఎల్ సినిమాతో ఫుల్ లెన్త్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అయింది సోనాక్షి సిన్హా. అందులో భాగంగానే ఫ్యాషన్ తో మూవీ ప్రమోషన్ చేసేస్తోంది .
