Sonakshi Sinha : బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, నటుడు విజయ్ వర్మలు అంతర్జాతీయంగా దూసుకుపోతున్నారు. వీరి కొత్త వెబ్ సిరీస్ దహాద్ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. అంతేకాదు ఈ సిరీస్ కు ప్రేక్షకుల మంచి ఆదరణ లభించింది.

ఈ సందర్భంగా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్పెట్ మీద నడిచి సందడి చేశారు సోనాక్షి , విజయ్ .ఫ్యాన్స్ ను ఖుషి చేశారు. తమ రెడ్ కార్పెట్ లుక్స్ ను పోస్ట్ చేసి ఈ జంట ఇన్ స్టాగ్రామ్ లో హీట్ పెంచారు.

సోనాక్షి తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో బెర్లిన్ ఫెస్టివల్ కు సంబంధించిన పిక్స్ ను పోస్ట్ చేసింది. ‘@బెర్లినాలే!!! ఈ అనుభవం చాలా అద్భుతంగా ఉంది. ఈ అద్భుతమైన వ్యక్తులతో నేను మొదటిసారి పని చేస్తున్నాను, ఫిల్మ్ ఫెస్టివల్‌లో మొదటి సారి నా మొదటి సిరీస్!!’ అంటూ సోనాక్షి తన అనుభవాలను రాసింది.

సోనాక్షి మరియు విజయ్‌తో పాటు జోయా అక్తర్ , షో డైరెక్టర్లు రీమా కగ్టి ,రుచికా ఒబెరాయ్ లు రెడ్ కార్పెట్ మీద మెరిశారు. దహాద్ ఎనిమిది భాగాల క్రైమ్ డ్రామా. ఇందులో సోనాక్షి అంజలి భాటి అనే నిర్భయ పోలీసు చుట్టూ తిరుగుతుంది.గుల్షన్ దేవయ్య , సోహమ్ షా లు కూడా ఈ సిరీస్‌లో నటించారు.

దహాద్ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ చేయబడిన మొదటి భారతీయ వెబ్ సిరీస్. ఈ ఈవెంట్ కోసం సోనాక్షి సిన్హా నల్లటి మెరిసే దుస్తులను ధరించింది రెడ్ కార్పెట్ మీద అదరగొట్టింది.
