Sonakshi Sinha : సోనాక్షి సిన్హా ఇటీవల విడుదలైన డబుల్ ఎక్స్‌ఎల్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. హుమా ఖురేషి కూడా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సోనాక్షి తన నటనతో నే కాదు మూవీ ప్రమోషన్ కోసం వేసుకున్న దుస్తులతూను అత్యద్భుతమైన ఫ్యాషన్ వాదిగా పేరు సంపాదించుకుంది.

Sonakshi Sinha : ఒక్కసారి సోనాక్షి సిన్హా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ను చూస్తే ఫ్యాషన్ ప్రియులు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇటీవలి మూవీ రిలీజ్ తర్వాత రిలాక్సేషన్ కోసం విహారయాత్ర కు వెళ్లిన ఈ దబాంగ్ నటి డెనిమ్ ప్యాంట్‌సూట్‌లో క్యాజువల్ లుక్ లో చిక్ టచ్ ఇచ్చింది.

డెనిమ్ ప్యాంట్‌సూట్ తో హాట్ ఫోటో షూట్ చేసి పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి కుర్రాళ్ళ మతులుపోగొట్టింది ఈ బొద్దుగుమ్మ. ప్రింటెడ్ డెనిమ్ ప్యాంట్‌సూట్ కు మ్యాచింగ్ గా వైట్ టీ షర్ట్ వేసుకుని ఎంతో హాట్ గా కనిపించింది సోనా.

ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా మేకప్ వేసుకుని నెయిల్ ఆర్ట్ తో అందరి లుక్స్ ను తనపై పడేలా చేసుకుంది. చెవులకు హోప్ ఇయర్ రింగ్స్ , చేతి వేళ్ళకు డైమండ్ ఉంగరాలు పెట్టుకుని ట్రెండీ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తోంది.

అంతకుముందు మూవీ ప్రమోషన్ కోసం స్ట్రీట్ స్టైల్ లుక్ లో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది. బ్లాక్ కలర్ లెగ్గింగ్ ,దానికి మ్యాచింగ్ గా బ్లాక్ కలర్ ట్యాంక్ టాప్ వేసుకుంది. ఈ ప్యాంట్ , టాప్ పైకి ఫేషియల్ ప్రింట్స్ తో వచ్చిన ఓవర్ సైజ్ వైట్ షర్ట్ వేసుకుని అదరగొట్టింది.

కళ్ళకు బ్లాక్ కలర్ కళ్ళజోడు , చేతికి బ్లాక్ కలర్ వాచ్, కాళ్లకు బ్లాక్ కలర్ బూట్స్ వేసుకుని బ్లాక్ కలర్ ఫ్యాషన్ లవర్స్ ను అట్ట్రాక్ట్ చేసింది.

రీసెంట్ గా మరో స్టైల్ లో ప్యాంట్ సూట్ వేసుకుని అలరించింది సోనాక్షి.క్లాసీ బ్రాలెట్, ఫ్లేర్డ్ డెనిమ్ జీన్స్ కు బ్లేజర్ సెట్ వేసుకుని బాస్ లేడీ గెటప్ లో అదరగొట్టింది. ఈ అవుట్ ఫిట్ తో వింటర్ వేర్ వార్డ్ రోబ్ ఫ్యాషన్ ను ప్రమోట్ చేస్తోంది.
