Sonakshi Sinha : సోనాక్షి సిన్హా ఫిన్‌ల్యాండ్ లో తన హాలిడే వెకేషన్ ను ఎంజాయ్ చేసి ఇటీవలే తిరిగి వచ్చింది. ఎవరైనా చలి కలం లో వెచ్చగా గడపాలని అనుకుంటా రు కానీ నటి సోనాక్షి మాత్రం ప్రత్యేకం.ఇటీవల సెలవుల కోసం ఫిన్‌ల్యాండ్ ను సందర్శించింది ఈ బ్యూటీ . అప్పటి నుండి ఆమె ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో మంచుతో కప్పబడిన ప్రాంతాలలో చిల్ అవుతున్న పిక్స్ ను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఆమె ట్రావెల్ డైరీల పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ తో సోనాక్షి వింటర్ ప్రధాన ప్రయాణ లక్ష్యాలను అందిస్తోంది .

మంచుతో కప్పబడిన ప్రాంతంలో సోనాక్షి చిల్ అయిన పిక్స్ ను లేటెస్ట్ గా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తోంది. సోనాక్షి తాజాగా ఫిన్ ల్యాండ్ నుండి తిరిగి వచ్చింది , ఇప్పటికి అక్కడి ప్రాంతాన్ని మిస్ అవుతోందట ఈ చిన్నది .

సోనాక్షి బ్లాక్ టర్టిల్‌నెక్ స్వెటర్ , తెల్లటి ట్రెంచ్ కోట్‌తో , ఒక జత నలుపు రంగు టైట్స్ , మోకాళ్ల వరకు ఉండే బూట్‌లతో టెంట్ ముందు చలి లో వణుకుతూ కెమెరాకు పోజులిచ్చింది. నలుపు గ్లోవ్స్‌లో, ఆమె తన శీతాకాలపు రూపాన్ని పూర్తి చేసింది.

హాయిగా ఉండే క్యాబిన్, చుట్టూ కమ్ముకున్న మంచు, ఉత్తమమైన కాఫీ తిరిగి నన్ను పిలుస్తున్నాయని ఈ పిక్స్ కింద కామెంట్స్ ను పోస్ట్ చేసింది.

ఈ వెదర్ కు, అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా తన కురులను మధ్య పాపిట తీసుకుని లూస్ గా వదులుకుంది. మినిమల్ మేకప్‌లో, సోనాక్షి తన లుక్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోనాక్షి మంచుతో ఆడుకుంటూ తన లోపలి బేబీ సోనాక్షిని అందరికి చూపించింది.
Advertisement