Sonakshi Sinha : సోనాక్షి సిన్హా అద్భుతమైన ఫ్యాషన్ వాధి. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సోనాక్షి తన ఫ్యాన్స్‌ను హాట్ హాట్ ఫోటో షూట్‌లతో అలరిస్తుంటుంది. తాజాగా రెడ్ కలర్ అవుట్‌ఫిట్ ధరించి హాట్ హాట్ పోజులు ఇచ్చి రచ్చ రచ్చ చేసింది ఈ చిన్నది. ఈ అవుట్‌ఫిట్ పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేయగా అభిమానులు హార్ట్ సింబల్స్‌ను పోస్ట్ చేశారు.

Sonakshi Sinha : తొడ ఎత్తు వరకు చీలికతో వచ్చిన ఫాల్గుని షానే పీకాక్ గౌనులో సోనాక్షి సిన్హా అదరగొట్టింది. ఈ సారి డేరింగ్ స్టైల్ తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది ఈ చిన్నది. మోహిత్ రాయ్, శుభి కుమార్‌లు సోనాక్షి సిన్హాకు స్టైలిష్ లుక్స్‌ను అందించారు. సోనాక్షి ధరించిన క్రిమ్సన్ గౌన్‌ను మిడ్ రిఫ్ బేరింగ్‌తో డిజైన్ చేశారు. ప్లంగింగ్ స్వీట్‌హార్ట్ నెక్ లైన్ , లాంగ్ స్లీవ్స్‌ను అందించారు. ఈ అవుట్ ఫిట్ లోని స్లీవ్స్‌కు వచ్చిన నెట్ డీటైల్స్ సోనాక్షి లుక్స్‌కు స్పెషల్ అట్రాక్షన్‌ను తీసుకువచ్చాయి.

అందమైన మెటాలిక్ సీక్విన్ అలంకారాలు, టసెల్స్, క్రిస్టల్స్, బగల్ పూసలతో పాటు ఎంబ్రాయిడరీతో వచ్చిన ఈ గౌనులో సోనాక్షి గ్లామరస్ లుక్స్ అందరిని
మంత్రముగ్ధులను చేస్తోంది . ఇక ఈ ఫోటో షూట్ కోసం ఇచ్చిన సోనాక్షి బోల్డ్ ఎక్స్‌ప్రెషన్స్ ఫ్యాన్స్‌కు చెమటలు పట్టిస్తున్నాయి. ఈ అవుట్‌ఫిట్‌కు కాంట్రాస్ట్‌గా
నియాన్ ఆరేంజ్ టై అప్ హీల్స్ , కాలి వేళ్లకు పీచ్ కలర్ పాలిష్ వేసుకుని స్టైలిష్ లుక్స్‌తో మెరిసిపోయింది.

సోనాక్షి తన పొడవాటి కురులను బీచ్ వేవ్స్ లా కనిపించేలా లూజ్‌గా వదిలేసింది. సోనాక్షి మేకప్ లుక్స్ కూడా అందరిని ఆకట్టుకుంటాయి. కనులకు బ్లష్ పింక్ ఐ ష్యాడో, ఐలైనర్ వేసుకుని న్యూడ్ మేకప్, న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుని గ్లామరస్‌గా కనిపించింది.

అంతకు ముందు సోనాక్షి నారింజ రంగు అదిరిపోయే బ్లేజర్ షార్ట్ డ్రెస్ వేసుకుని తన థైస్ అందాలు చూపిస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఓ ఫోటో షూట్ కోసం మిస్ గౌడెడ్ అనే క్లాతింగ్ లైన్ షెల్ఫ్ నుంచి ఈ అవుట్‌ఫిట్‌ను ఎన్నుకుంది సోనాక్షి. ఈ పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి యూత్ మనసులను చెదరగొట్టింది.

