Sonakshi Sinha : అల్ట్రా-గ్లామ్ గౌన్‌ల నుండి ఎయిర్‌పోర్ట్ స్టైల్ అవుట్ ఫిట్స్ వరకు ఎప్పుడూ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన ఫ్యాషన్ గేమ్ ను కొనసాగిస్తుంటుంది. ఈ బొద్దుగుమ్మ ఏ అవుట్ ఫిట్ వేసుకున్నా ముద్దుగానే కనిపిస్తుంది. చిక్ ఎత్నిక్ స్టైల్స్ లో మెస్మరైజ్ చేయడంలో ఈ భామ ముందు వరుసలో ఉంటుంది.

Sonakshi Sinha : ఫ్యాషన్ డిజైనర్ అనామికా ఖన్నా షెల్ఫ్‌ల నుండి అద్భుతమైన రెడ్ ప్రింటెడ్ కో-ఆర్డ్ సెట్ లో హాట్ ఫోటో షూట్ చేసి ఈ భామ అద్భుతమైన ఎత్నిక్ ఫ్యాషన్స్ ను ప్రమోట్ చేస్తోంది. పూల ప్రింటెడ్ స్కర్ట్‌ను ధరించి, ఎంబ్రాయిడరీ చేసిన లేత గోధుమరంగు బ్లౌజ్ జత చేసింది. అందమైన డిజైన్స్ కలిగిన ఈ డ్రెస్ సోనాక్షి అందాలను ఎలివేట్ చేసాయి.

తన లుక్స్ కు అదనపు అందాన్ని జోడించేందుకు సోనాక్షి ప్రింటెడ్ ష్రగ్ ను వేసుకుంది. మేకప్ కోసం, ఆమె పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్ వేసుకుని ప్రకాశవంతమైన ఆకర్షణీయమైన వేషధారణతో అదరగొట్టింది.

సోనాక్షి సిన్హా నిజమైన ఫ్యాషన్ వాది. ఆమె చిక్ ఫ్యాషన్ ఎంపికలు అందుకు రుజువుగా నిలుస్తాయి . రీసెంట్ గా పాపా డోంట్ ప్రీచ్ అనే ఫ్యాషన్ లేబుల్ నుంచి ఆలివ్ గ్రీన్ త్రీ పీస్ సెట్ ను ధరించి నటి ఎప్పటిలాగే చాలా అందంగా కనిపించింది.

ఆమె చిక్ క్రాప్ టాప్‌ను స్టైలిష్ మోడ్రన్ స్కర్ట్‌తో జత చేసింది. ఈ అవుట్ ఫిట్ కు షీర్ కేప్ ను జోడించి స్టైలిష్ లుక్స్ తో మేస్మరైజ్ చేసింది.

నటి సోనాక్షి సిన్హా తన ఫ్యాషన్ ఎంపికలతో మనల్ని విస్మయానికి గురిచేయని రోజు ఒక్కటి కూడా లేదు. రంగురంగుల కో-ఆర్డ్ సెట్ లను ధరించి చమత్కారమైన ట్విస్ట్ ఇస్తోంది. ఆమె చిక్ బ్లేజర్ స్టైల్ క్రాప్ టాప్‌ని ,నాట్ స్కర్ట్‌తో జత చేసింది.

లుంగీ స్టైల్ లో ఉన్న ఈ అవుట్ ఫిట్ లో ఏంటో హాట్ గా కనిపించింది. సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ ఈ పిక్స్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఫ్యాన్స్ ను మంత్రముగ్ధులను చేసింది.
