
Sonakshi Sinha : బాలీవుడ్ బ్యూటీ, సోనాక్షి సిన్హా ఫిన్‌లాండ్‌లో తన హాలిడే ను ఫుల్ లెన్త్ గా ఎంజాయ్ చేస్తోంది. తన హాలిడే కు సంబంధించిన మధుర క్షణాలను కెమెరాలో బంధించి సోషల్ మీడియా వేదికగా తన ఫాలోవర్స్ తో పంచుకుంది ఈ చిన్నది. నటి, కొన్ని చిత్రాలలో, మంచుతో కప్పబడిన పర్వతాలలో పోజులిచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. మరొక షాట్‌లో, ఆమె స్నోమాన్‌తో క్రేజీ పిక్స్ ను దిగింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

చాలామంది సెలెబ్రిటీలు తమ హాలిడేస్ ను ఎంజాయ్ చేసేందుకు మాల్దీవ్స్, ఫ్రాన్స్, దుబాయ్, వంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. ఎక్కువగా బీచ్ ప్రాంతాల్లో గడిపేందుకు ఇష్టపడతారు . కానీ బాలీవుడ్ బ్యూటీ , బొద్దుగుమ్మ సోనాక్షి మాత్రం అందరికన్నా భిన్నంగా ఓ మంచు కురిసే ప్రదేశం లో హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తోంది.

ఎముకలు కొరికే చలిలో , మంచు కురుస్తున్న వేళల్లో అక్కడి అందమైన ప్రాంతాలను హైలెట్ చేస్తూ ఫోటో దిగి వాటిని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి అందరిని మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ పిక్స్ ను పోస్ట్ చేసి అందమైన కాప్షన్ ను జోడించింది సోనాక్షి.

“మొదటిసారిగా మంచు కురుస్తున్న అనుభూతి ఎంత అద్భుతంగా ఉంది… నా అరోరా క్యాబిన్ లోపల నుండి నక్షత్రాలను చూస్తూ, విశాలమైన తెల్లటి విస్తీర్ణంలో హస్కీ స్లెడ్జింగ్ చేస్తూ, ఉత్తర దీపాలను వెంబడిస్తూ, మధ్యమధ్యలో భోగి మంటలు వేస్తూ, హాట్ చాక్లెట్ తాగుతూ , -14 డిగ్రీల వద్ద గడ్డకట్టిన ప్రాంతంలో హాట్ టబ్‌లోకి వెళ్లి స్నానం చేయటం ఎంతో బాగుంది అని తన అనుభూతిని పంచుకుంది సోనాక్షి.

సోనాక్షి సిన్హా 2010లో సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె సల్మాన్ ఖాన్‌తో కలిసి దబాంగ్ సిరీస్‌లోని ఇతర రెండు భాగాలలో కూడా నటించింది. సోనాక్షి సిన్హా రౌడీ రాథోర్, సన్ ఆఫ్ సర్దార్, దబాంగ్ 2, హాలిడే, ఏ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ, లూటేరా, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దోబారా, రాజ్‌కుమార్, యాక్షన్ జాక్సన్, కళంక్, భుజ్ వంటి చిత్రాలలో నటించింది.

ప్రైడ్ ఆఫ్ ఇండియా , మిషన్ మంగళ్, ఇతర వాటిలోను మెరిసింది. ఆమె చివరిసారిగా జహీర్ ఇక్బాల్ , హుమా ఖురేషితో కలిసి డబుల్ ఎక్స్‌ఎల్‌లో కనిపించింది. త్వరలో కాకుడలో కనిపించి అలరించనుంది.
Advertisement