Sobhita Dhulipala : నల్ల చీరలో తన నయగారాలు చూపిస్తూ కుర్రాళ్ల నజర్‌ను తనవైపు తిప్పుకుంటోంది పొన్నియన్ సెల్వన్ 1 బ్యూటీ శోభితా ధూళిపాళ. ఓ అవార్డు ఫంక్షన్‌కోసం చీరకట్టుతో కనిపించి కవ్వించింది ఈ బ్యూటీ. తెల్లటి మేనిఛాయతో ఉన్న ఈ ముద్దుగుమ్మ నల్ల చీరలో తారలా మెరిసింది. తన నాభి అందాలను చూపిస్తూ రకరకాలుగా ఇంట్లో దిగిన హాట్ ఫోటోలను ఈ ముద్దుగుమ్మ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. శోభితా లుక్స్‌పైన కుర్రాళ్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.

Sobhita Dhulipala : ఇటీవల జరిగిన ఓ అవార్డ్ షోలో శోభితా ధూళిపాళకు మౌల్డ్ బ్రేకర్ అనే అవార్డు దక్కింది. ఈ టైటిల్ ఆమె వెండితెరపై కనిపించే పాత్రలకే కాకుండా ఆమె ఫ్యాషన్ ఎంపికలకు కూడా చాలా పర్ఫెక్ట్‌గా సరిపోతుందని అభిప్రాయపడుతున్నారు శోభితా ఫ్యాన్స్.ఈ అవార్డు ఫంక్షన్‌లో చీరకట్టుతో చెలరేగిపోయింది శోభితా. అత్యంత ఆకర్షణీయమైన నలుపు చీర కట్టుకుని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

సీక్విన్ డ్రేప్ దుస్తుల బ్రాండ్ ఐటీ ఆర్‌హెచ్ షెల్ఫ్ నుంచి ఈ నలుపు రంగు చీరను అవార్డు ఫంక్షన్ కోసం ఎన్నుకుంది శోభితా. ఈ చీరకు జతగా స్కూప్ నెక్‌లైన్ తో డిజైన్ చేసిని స్ట్రాపీ బ్లౌజ్‌ను ధరించింది. ఈ చీరకు మరింత అట్రాక్షన్‌ను తీసుకువచ్చేందుకు నలుపు రంగులో ఉన్న కేప్‌ను వేసుకుంది.

శోభితా ఈ చీరకు తగ్గట్లుగా ఆభరణాలను ఎన్నుకుంది. స్టేట్‌మెంట్ సిల్వర్ స్టడ్‌లను చెవులకు అలంకరించుకుంది. కనులకు వింగెడ్ ఐ లైనర్, పెదాలకు రెడ్ కలర్ లిప్ స్టిక్ పెట్టుకుని తన గ్లామరస్ గేమ్ తో అందరి మైండ్ బ్లాక్ చేసింది.

ఈ మధ్యనే శోభితా తన మూవీ ప్రమోషన్ కోసం బ్లాక్ ప్రింట్స్‌తో వచ్చిన వైట్ శారీని కట్టుకుని ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేసింది. ఈ అందమైన వైట్ అండ్ బ్లాక్ చీరకు శోభితా స్లీవ్ లెస్ బ్లౌజ్‌ను ధరించింది. స్టేట్‌మెంట్ చెవి రింగులు, చేతికి బ్యాంగిల్స్ వేసుకుని సాంప్రదాయ రూపానికి మరింత వన్నెను తీసుకువచ్చింది.శోభితా ఈ చీరకట్టుకు కాస్త అట్రాక్షన్‌ను తీసుకువచ్చేందుకు ముఖానికి సన్ గ్లాసెస్ పెట్టుకుంది.

అంతకు ముందు మింట్ కలర్ చీర కట్టుకుని అందరినీ మంత్రముగ్ధులను చేసింది శోభితా. బంగారపు పట్టీ బార్డర్‌తో గొట్టా వర్క్ డీటైల్స్‌తో వచ్చిన ఈ చీరకట్టులో మెరిసిపోయింది. ఈ చీరకు మ్యాచింగ్‌గా స్లీవ్‌లెస్ హాల్టర్ నెక్‌లైన్ తో వచ్చిన బ్లౌజ్‌ను వేసుకుంది. హాట్ ఫోటో షూట్‌లు చేసి యూత్‌ను ఫిదా చేసింది.

రీసెంట్‌గా జరిగిన ఓ ఫంక్షన్ కోసం సింపుల్ మెటాలిక్ గోల్డ్ కలర్ చీరను కట్టుకుని మెరిసింది శోభితా. ఈ చీరకు మ్యాచింగ్‌గా బ్లాక్, గోల్డెన్ స్ట్రాప్స్ తో వచ్చిన బ్లౌజ్‌ను ధరించింది. మెడలో చోకర్ నెక్‌లెస్ పెట్టుకుని మ్యాచింగ్ ఇయర్‌రింగ్స్ చెవులకు అలంకరించుకుని దేవకన్యలా మెరిసిపోయింది.
