అందాల పోటీలలో గెలుపొంది ఏకంగా బాలీవుడ్ లోనే హీరోయిన్ గా అడుగుపెట్టిన తెలుగమ్మాయి శోభిత దూళిపాళ్ల. ఈ అమ్మాయి లుక్స్ పరంగా నార్త్ ఇండియా భామల ఫీచర్స్ ఉండటంతో హిందీలో బాగానే సక్సెస్ అయ్యింది. మొదటి సినిమాలోనే కాస్తా హాట్, ఇంటిమేట్ సన్నివేశాలలో నటించి తనకి ఎలాంటి పాత్రలైనే ఒకే అనే సిగ్నల్స్ ని ఇచ్చింది. అలాగే ఎప్పటికప్పుడు హాట్ బికినీ ఫోటోషూట్ లని షేర్ చేస్తూ నార్త్ ఇండియా భామలకి నేను ఏ మాత్రం తీసిపోని అనే సంకేతాన్ని అక్కడి దర్శకులకి ఇచ్చింది. దీంతో నటిగా హిందీలో శోభితకి బాగానే అవకాశాలు వచ్చాయి.
వైజాగ్ లో పుట్టి పెరిగిన ఈ తెనాలి అమ్మాయి రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ సినిమాతో కోలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. ఇక అడవి శేష్ ఈ భామని గూఢచారి సినిమాతో టాలీవుడ్ కి పరిచయం చేశాడు. తరువాత రెండో సినిమాని కూడా మేజర్ గా అడవి శేష్ తోనే శోభిత చేసింది. మళ్ళీ ఆమెకి తెలుగులో మూడో అవకాశం కూడా ఈ హీరోనే ఇస్తున్నాడని టాక్. ఇతర దర్శకులు ఎవరూ కూడా తమ సినిమాల కోసం శోభిత పేరుని ఏ కోణంలో కూడా పరిశీలించడం లేదు.
అయితే తెలుగు దర్శకులు పట్టించుకోకపోయిన ఈ బ్యూటీ మాత్రం తన హవాని కొనసాగిస్తూనే ఉంది. హిందీ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా సందడి చేస్తుంది. ది నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్ తో త్వరలో ప్రేక్షకులని పలకరించనుంది. అలాగే మంకీ మెన్ అనే మూవీతో శోభిత హాలీవుడ్ లోకి కూడా అడుగుపెడుతుంది. ఆ సినిమాలో ఆమెకి కీలక పాత్రనే దొరికినట్లు తెలుస్తుంది. తన అందం, నటనతో నార్త్ ఇండియా ప్రేక్షకులని అలరిస్తున్న తెలుగమ్మాయికి తెలుగు సినిమాలలో అవకాశం దొరకకపోవడం నిజంగా దురదృష్టం అని చెప్పాలి.