Snake Bite: పాములంటే అందరికీ భయమే. ఎందుకంటే పాము కాటు వేస్తే ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాము కాటుకు ప్రాణం పోతుందని మనిషికి తెలుసు కాబట్టే వాటిని చూసే సరికి సర్వసాధారణంగా మనుషులు భయపడుతూ ఉంటారు. కానీ అన్ని పాములకు విషం ఉండదు. కొన్ని జాతులకు సంబంధించిన పాములకు మాత్రమే విషం ఉంటుంది. ఏ పాము కాటు వేసిందనే విషయం తెలిస్తే దానికి విరుగుడు మందును వైద్యులు ఇవ్వడం జరుగుతుంది.
వర్షాకాలంలో తరచూ పాములు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో సైత నివాస ప్రాంతాల్లో పాములు దర్శమిస్తాయి. గ్రామాల్లో పొలాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ క్రమంలో ఒడిస్సా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లా దొరోడా గ్రామంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సలీమ్ నాయక్ తన పొలంలో తిరుగుతున్న సమయంలో ఓ నాగు పాము కాటు వేసింది. ఎవరైనా పాము కాటు వేస్తే భయంతో ప్రాణం కాపాడుకునేందుకు వైద్యం కోసం పరుగులు తీసి ఆసుపత్రికి వెళ్తారు.

Snake Biyte: పాము కాటేసిందని చంపేశాడు
కాని, సలీమ్ నాయక్ మాత్రం అందుకు భిన్నంగా తనను కాటేసి పారిపోతున్న సర్పాన్ని వెంబడించి పట్టుకోవడం జరిగింది. అందేటని అనుకుంటున్నారా….? నిజమే తనను కాటేసిన పామును సలీమ్ నాయక్ పట్టుకుని చంపేశాడు. చంపడం అంటే అలా ఇలా కాదు. ఏకంగా పాము తల, తోక పట్టుకుని మిగతా భాగాన్ని తన నోటితో కసితో కొరికేశాడు. దీంతో ఆపాము రక్తస్రావంతో చనిపోయింది. అంతటితో వదిలేయకుండా ఆ పామును తన మెడలో వేసుకుని ఊరంతా తిరిగాడు.
అంతేకాదు పాము కాటుకు అతను వైద్యం కూడా చేయించుకోలేదండోయ్.. ! సాధారంణంగా నాగుపామును చంపేస్తే సంప్రదాయం ప్రకారం దహనం చేస్తారు. కాని సలీం అలా చేయకుండా ఖననం చేశాడు. ఈ ఘటనను చూసిన ఊరి ప్రజలందరూ ఒకింత ఆశ్చర్యానికి గురి అయ్యారు. మాములుగా నాగుపామును ఏమైనా చేయాలనుకుంటే అది పగ పడుతుందని పెద్దలు చెబతూ ఉంటారు. కానీ ఇక్కడ మనిషే తనను కాటు వేసినందుకు నాగుపామును వెంటాడి మరీ ప్రాణాలు తీసి తన పగను తీసుకోవడం నిజంగానే గమనార్హం.
![]() | ReplyForward |