Skin care: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అప్పుడే చల్లబడింది. చలికాలం రానున్న రోజుల్లో ప్రతాపం చూపించడానికి సిద్ధమైంది. దీంతో అందరూ చలికాలం నుండి ఎలా తమను తాము కాపాడుకోవాలనే ఆలోచనలో ఉంటున్నారు. తీవ్రమైన చలిలో మీ చర్మాన్ని ఎలా సంరక్షించుకోవాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
నీళ్లు తీసుకోవడం తగ్గకుండా చూసుకోండి:
మనలో చాలామంది ఎండాకాలంలో వేడి వల్ల ఎక్కువ నీటిని తాగి, చలికాలంలో తక్కువ నీటిని తాగే అలవాటు ఉంటుంది. కానీ దాహం తక్కువగా ఉంది కదా అని చెప్పి చలికాలంలో నీటిని తక్కువ తీసుకోకూడదు. దీని వల్ల శరీరంలో తేమ తగ్గుతుంది. మీ చర్మాన్ని రీహైడ్రేట్ చేయడానికి ఉత్తమ మార్గం పుష్కలంగా నీరు తాగడం. రోజుకు కనీసం 2 లీటర్ల నీరు తాగాలి. ఒకవేళ నీటిని తాగడంలో బోరింగ్ అనిపిస్తే కాస్త నిమ్మరసాన్ని పిండుకోవాలి. నీటిని తాగడానికి ఇష్టంలేని వాళ్లు పండ్ల రసాలు తీసుకోవాలి.
విటమిన్ సి ఎక్కువగా అందేలా చూసుకోవాలి:
మన చర్మ సంరక్షణలో విటమిన్ సి అనేది ఎంతో కీలకం అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మాన్ని రక్షిస్తాయి. విటమిన్ సి కోసం వీలైనంత వరకు సిట్రస్ పండ్లను తినాలి.
బీట్ రూట్ ని ఆహారంలో చేర్చుకోండి:
మార్కెట్లో మనకు ఎంతో ఆకర్షణీయమైన రంగులో కనిపించే బీట్ రూట్ చర్మ రక్షణలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి బీట్ రూట్ ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరంలో రక్తం పెరిగి, అది బాగా ప్రసరించడం వల్ల చర్మానికి మేలు కలుగుతుంది. అలాగే చనిపోయిన కణాలు శరీరం నుండి బయటకు వెళ్లడం వల్ల చర్మం ఎంతో కాంతివంతంగా కనిపిస్తుంది.
ఆకుకూరలు బాగా తినండి:
మార్కెట్లో అతి చవకగా దొరికే ఆకు కూరలతో పాటు కొన్ని రకాల కూరగాయల వల్ల చర్మాన్నిరక్షించుకోవడానికి వీలవుతుంది. బచ్చలికూర, క్యాబేజీ, మెంతిఆకులతో పాటు ఆవాలను తగినంత తీసుకుంటే చర్మానికి మేలు కలుగుతుంది.
Skin care:
డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మర్చిపోకండి:
శరీరానికి అన్ని పోషకాలు అందించడంలో భాగంగా డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం మర్చిపోకండి. డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది.