మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమాఈ తో చెర్రీ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ నేపధ్యంలోనే ప్రస్తుతం సౌత్ ఇండియా స్టార్ దర్శకుడు శంకర్ తో రామ్ చరణ్ మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. శంకర్ తరహాలోనే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సందేశాత్మక కథ కూడా ఉటుంది. ఇప్పుడు కూడా అలాంటి సోషల్ మెసేజ్ కాన్సెప్ట్ తోనే శంకర్ రామ్ చరణ్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక దీనిపై మెగా అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ప్రస్తుతం మరో ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నే తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ సినిమాలో నెగిటివ్ రోల్ కోసం ఎస్.జె.సూర్య కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. దర్శకుడుగా కెరియర్ ప్రారంభించిన ఎస్.జె.సూర్య పవన్ కళ్యాణ్ తో ఖుషి మూవీ చేసి పవర్ స్టార్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చాడు. తరువాత నటుడుగా కూడా మారాడు. తన దర్శకత్వంలోనే హీరోగా చేశాడు. అయితే ఆ సినిమాలు అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. తరువాత దర్శకుడుగానే కొనసాగాడు.
పవన్ కళ్యాణ్ తో పులి అనే సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. తరువాత కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ నటుడుగా పునరాగమనం చేసాడు. తెలుగులో సూపర్ స్టార్ కి విలన్ గా స్పైడర్ సినిమాలో సూర్య కనిపించాడు. ఈ సినిమాలో విలన్ గా మెప్పించిన మూవీ ఫ్లాప్ అయ్యింది. అయితే తరువాత తమిళంలో మాత్రం భయానా అవకాశాలు వచ్చాయి. అక్కడ సక్సెస్ ఫుల్ విలన్ గా కొనసాగుతున్నాడు. ఈ నేపధ్యంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే రామ్ చరణ్ సినిమాలో కూడా మెయిన్ విలన్ పాత్ర కోసం ఎస్.జె.సూర్యని ఖరారు చేసినట్లు తెలుస్తుంది.