తెలుగు నుంచి హిందీలోకి వెళ్తున్న సినిమాలు ఈ మధ్యకాలంలో వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంటున్నాయి. బాహుబలి తర్వాత సౌత్ సినిమా మీద నార్త్ ఇండియన్ ప్రేక్షకులకి ఉన్న అభిప్రాయాలు పూర్తిగా మారిపోయాయి. తెలుగు నుంచి పాన్ ఇండియా మూవీ వస్తుంది అంటే కచ్చితంగా అందులో ఏదో కొత్త విషయం ఉంటుంది. ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసే అంశాలు పుష్ఫలంగా ఉంటాయి అనే అభిప్రాయం అక్కడ వచ్చేసింది. అలాగే తెలుగు సినిమాలలో హిందుత్వ ద్వేషం ఎక్కడా కూడా మచ్చుకైనా కనిపించదు. హిందూ దేవుళ్ళని చాలా గొప్పగా తెలుగు సినిమాలలో చూపిస్తారు. అలాగే ఇండియన్ కల్చర్ ని కూడా చాలా గ్రాండ్ గా సినిమాలలో ప్రెజెంట్ చేస్తారు అనే విషయాన్ని నార్త్ ఇండియన్ ప్రేక్షకులు అర్ధం చేసుకోవడం వలన తెలుగు సినిమాలకి అక్కడ మంచి ఓపెనింగ్స్ దొరుకుతున్నాయి.
అలాగే లాంగ్ రన్ లో సబ్జెక్ట్ బాగుంటే మంచి సక్సెస్ కూడా అందుకుంటున్నాయి. ఇక ఇప్పుడు సీతారామం సినిమా కూడా దీనిని మరోసారి రుజువు చేసింది. సౌత్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ మూవీని హిందీలో డబ్ చేసి సెప్టెంబర్ 2న రిలీజ్ చేశారు. సినిమాకి కనీసం అక్కడ ప్రమోషన్ కూడా చేయలేదు. అయితే కూడా మొదటి రోజు నుంచి సూపర్ హిట్ టాక్ తో ఈ సినిమా దూసుకుపోతుంది. ముఖ్యంగా నార్త్ లో మౌత్ టాక్ ఈ సినిమా మీద హైప్ ని పెంచుతుంది. అక్కడ వెబ్ సైట్స్ రివ్యూలు కూడా అద్భుతంగా సీతారామం సినిమా ఉందని రాయడంతో ప్రేక్షకులు థియేటర్స్ వైపు వెళ్లడం మొదలు పెట్టారు.
సినిమాలో లవ్ స్టోరీ, నేరేషన్, హిందూ, ముస్లిం మధ్య ఉన్న ఐక్యత, అలాగే బాలీవుడ్ ప్రేక్షకులకి చేరువ అయిన మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ పెర్ఫార్మెన్స్ కి అక్కడి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. చాలామంది ఆర్టిస్ట్స్ హిందీ ప్రేక్షకులకి తెలిసినవారే కావడంతో సినిమాకి అదనపు అడ్వాంటేజ్ అయ్యింది. దీంతో ఎలాంటి ప్రమోషన్ హడావిడి లేకుండానే అక్కడ సక్సెస్ తో మంచి కలెక్షన్స్ రాబట్టే దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడికి డబల్ కలెక్షన్స్ వచ్చేసాయి. ఇక హిందీలో వచ్చే కలెక్షన్స్ మొత్తం ఎక్స్ ట్రా బెన్ఫిట్ క్రిందనే ఉంటుంది. మరి ఈ సినిమా హిందీలో ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుంది అనేది చూడాలి.