ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ సక్సెస్ ఫుల్ మూవీగా ఇండియన్ వైడ్ గా ప్రేక్షకుల హృదయాలకి చేరువ అయిన సినిమాలలో సీతారామం మూవీ కచ్చితంగా ఉంటుందని చెప్పాలి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ లవ్ డ్రామా ఇండియన్ క్లాసిక్ చిత్రాల జాబితాలో కూడా చోటు దక్కించుకుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు మళ్ళీ మళ్ళీ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు అంటే ఎ రేంజ్ లో ప్రేక్షకులకి సీతా, రామ పాత్రలు రీచ్ అయ్యాయో అర్ధం చేసుకోవచ్చు. ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టని స్థాయిలో ఈ మూవీ కంటెంట్ హృదయాలని తాకుతుంది. లెఫ్ట్ నెంట్ రామ్ పాత్రలో దుల్కర్, సీతామహాలక్ష్మి పాత్రలో మృణాల్ ఠాకూర్ తమ పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేశారు.
ఇక హిందీలో కూడా ఈ సినిమాకి అద్బుతమైన స్పందన వచ్చింది. దీంతో బాలీవుడ్ సర్కిల్ లో కూడా సినిమా సక్సెస్ పై ప్రేక్షకులకి దర్శకుడు, దుల్కర్, మృణాల్ థాంక్స్ చెబుతూ మీట్ ఏర్పాటు చేశారు. విమర్శకుల నుంచి కూడా సినిమాకి ప్రశంసలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో క్రేజీ అప్డేట్ టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాతో అశ్వినీదత్ ఏకంగా వంద కోట్లకి పైగా కలెక్షన్స్ ని తమ ఖాతాలో వేసుకున్నారు.
ఈ నేపధ్యంలో హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్, మృణాల్ జోడీగా సీతారామం కాంబినేషన్ లో మళ్ళీ రిపీట్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్ తో సహా సీతారామం సినిమాలో భాగం అయిన వారు నెక్స్ట్ కాంబోలో కూడా ఉండనున్నట్లు టాక్. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బిటౌన్ లో కూడా ఇదే హాట్ న్యూస్ నడుస్తుంది. అయితే సీతారామం కాంబినేషన్ లో సినిమా అంటే దానికి మించి ఆడియన్స్ కోరుకుంటారు అనే విషయం తెలిసిందే. మరి ఈ విషయంలో దర్శకుడు ఎలాంటి కథతో వస్తాడు అనేది ఆసక్తిగా మారింది.