బిగ్ బాస్ హౌస్ లో ఉన్న 15 వారాలు తన ఆటతో తన అందంతో ప్రేక్షకులను అలరించి వాళ్ళ ఓటింగ్ తో టాప్ 5 లో నిలిచిన యూట్యూబర్,సీరియల్ నటి సిరి.హౌస్ లో షణ్ముఖ్ ప్రభావానికి లోనై కొన్ని తప్పులు చేసి వ్యతిరేకతని మూట గట్టుకుంది.ఫినాలే వచ్చేసరికి తన మీద తాను నమ్మకం కోల్పోయిన సిరి షణ్ముఖ్‌కు అవసరానికి మించిన ప్రాధాన్యత ఇచ్చింది. హౌస్ లోకి వచ్చేముందు మంచి ఆదరణ ఉన్న సిరి తన మీద తన ఆట మీద నమ్మకం కోల్పోవడం వల్లనే టాప్ 5 నుండి తోలట వైదొలగింది.
వారానికి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకూ రెమ్యునరేషన్ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకొని హౌస్ లోకి అడుగుపెట్టిన సిరి హౌస్ లో 15 వారాలు ఉన్నందుకు గాను దాదాపు 25 లక్షలు బిగ్ బాస్ నుండి అందుకుంది.ట్రోఫీ గెలవకపోయిన ప్రైజ్ మనిలో సగం గెలుచుకొని టాప్ 5 వరకు కొనసాగి విన్నర్ గా నిలిచింది