వెంకి అట్లూరి దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో ధనుష్ మొదటి సారి స్ట్రైట్ తెలుగులో చేస్తున్న సినిమా సార్. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో కార్పొరేట్ విద్యావ్యవస్థలో లోపాలు ఎత్తిచూపిస్తూ, సెటైరికల్ కామెడీతో ఈ సార్ మూవీని తెరకేకించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక సాయి కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ లో తెరకెక్కిన ఈ సినిమాని డిసెంబర్ 2న రిలీజ్ చేయాలని ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించారు. దానికి తగ్గట్లుగానే సినిమా అవుట్ ఫుట్ ని దర్శకుడు వెంకీ సిద్ధం చేస్తున్నాడు.
అయితే ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందంట. డిసెంబర్ 2 రిలీజ్ అనుకుంటున్న అప్పటికి ఇంకా అవుట్ ఫుట్ సిద్ధమయ్యే అవకాశం లేదనే మాట వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో సినిమా రిలీజ్ వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అయితే డిసెంబర్ ఆఖరునాటికి సినిమాని ప్రేక్షకులకి అందించాలని మళ్ళీ వచ్చే ఏడాదికి పొడిగించే ఆలోచన అయితే నిర్మాత, దర్శకుడికి లేదని టాక్. వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఓ రెండు నెలల పాటు పెద్ద సినిమాల హవా నడుస్తుంది.
మధ్యలో కొంత గ్యాప్ వచ్చిన వర్క్ అవుట్ అవ్వడాన్ని నిర్మాత భావిస్తున్నారు. ఇప్పటికే స్వాతిముత్యం సినిమాని రాంగ్ టైమింగ్ లో రిలీజ్ చేయడం వలన పాజిటివ్ టాక్ వచ్చిన ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. ఈ రిజల్ట్ ని దృష్టిలో ఉంచుకొని సార్ మూవీ రిలీజ్ ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ధనుష్ తమిళ్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న కెప్టెన్ మిల్లర్ సినిమాలో జాయిన్ అవ్వబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. దీని మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.