నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో హై ఎండ్ లో పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ కె. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీకల్ టీమ్ తో నాగ్ అశ్విన్ వర్క్ చేస్తున్నాడు. ఫ్యూచర్ టెక్నాలజీ మూవీగా దీనిని తెరపై ఆవిష్కరించేందుకు దర్శకుడు సిద్ధం అవుతున్నాడు. భారీ సెల్యులాయిడ్ మీద ఈ మూవీ త్రీడీ టెక్నాలజీతో ప్రెజెంట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే అమితాబచ్చన్ తో పాటు చాలా మంది అగ్రశ్రేణి నటులు కూడా ఇందులో భాగం అవుతున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ ఈ సినిమాని ఇండియా సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు రానంత పెద్ద బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సీనియర్ దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు కూడా మెంటర్ గా వర్క్ చేసినట్లు ఆ మధ్య టాక్ వినిపించింది.
అయితే అశ్వినీదత్, దర్శకుడు నాగ్ అశ్విన్ కోరిక మేరకు స్క్రిప్ట్ వరకు కొన్ని మార్పులు, చేర్పులు సూచించాను అంతకు మించి ఆ సినిమా విషయంలో నా ప్రమేయం ఏమీ లేదని సింగీతం తేల్చేశారు. ఇక సింగీతం సూచించిన మార్పులతో ప్రాజెక్ట్ కె లో నాగ్ అశ్విన్ కూడా కొంత రీవర్క్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఒక పెద్ద దర్శకుడు సలహాలని నాగ్ అశ్విన్ స్వీకరించి మరింత బెటర్ మెంట్ చేసుకునే ప్రయత్నం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రాజెక్ట్ కె, సలార్. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో మరింత అతని ఇమేజ్ ని పెంచే సినిమాలు అవుతాయని అందరూ భావిస్తున్నారు.